పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా.. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే లోకేష్.. రాష్ట్రంలో సం స్కరణలకు పెద్దపీట వేస్తున్నారు. దీనిలో భాగంగా భవిష్యత్తు ప్రణాళికలను ఆయన స్వప్నిస్తున్నారు. ఈ రోజు జరుగుతున్న పాలన బాగున్నా.. భవిష్యత్తులో రాష్ట్రం దేశంలోనే నెంబర్-1 అయ్యేలా కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని విషయాన్ని చంద్రబాబు చూస్తుంటే.. విశా ఖ మహానగరంపై లోకేష్ ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
దీనిలో భాగంగా అమెరికా, చైనాల తర్వాత ఏఐ రంగంలో విశాఖను ముందు నిలపాలన్న లక్ష్యంతో ఆయన అడుగులు వేస్తున్నారు. విశాఖపట్నం చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో భారీ డేటా సిటీ ని నిర్మించేలా ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. డేలా నిల్వతోపాటు.. ఏఐ చిప్ డిజైనింగ్, సర్వర్ తయారీ, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను కూడా నెలకొల్పడం ద్వారా విశాఖను గ్లోబల్ ఏఐ హబ్‌గా మార్చాలని నిర్ణయించుకున్నారు.
అమెరికా సంస్థలను ఆహ్వానించడంలో లోకేష్ అందెవేసిన చేయిగా మారారు. పట్టుబట్టి సాధిస్తున్న పెట్టు బడులతో గూగుల్ అమెరికా వెలుపల తన అతిపెద్ద ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌ను ఏపీకి అందిస్తోంది. దీంతో పాటు రిలయన్స్-బ్రూక్‌ఫీల్డ్ జాయింట్ వెంచర్ కూడా దాదాపు లక్ష కోట్ల రూపాయలను పెట్టుబడు లుగా పెట్టనుంది. ఇవన్నీ సాకారం అయితే.. 3 గిగావాట్ల డేటా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇది వస్తే.. కేవ లం ఐటీకే కాదు.. చుట్టుపక్కల ఉన్న భూముల ధరలు కూడా పెరుగాయి.
దీంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాం ఏర్పాటు కావడం.. మరో శుభసూచకం. అదేవిధంగా విశాఖపట్నం తీరాన్ని అంతర్జాతీయ సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్ ల్యాండింగ్ పాయింట్‌గా మారుస్తున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 2032 నాటికి విశాఖ స్వరూపమే మారిపోతుందని నారా లోకేష్ అంతర్గత చర్చల్లో చెబుతున్నారు. అంతేకాదు.. ఒక్క గ్రేటర్ విశాఖ మహా నగరం(10 జిల్లాలతో కలిపి) ఆర్థిక వ్యవస్థ 120 బిలియన్ డాలర్లకు చేరనుంది. ఇది.. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ఆదాయానికి నాలుగు రెట్లుగా అంచనా వేస్తున్నారు. సో.. ఇలా నారా లోకేష్ స్వప్నిస్తున్న విశాఖ 2032 నాటికి అద్భుతాన్ని సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.