`కోర్ట్‌` కు కాసుల వ‌ర్షం.. 3 డేస్‌లో వ‌చ్చిందెంతంటే?

News Image

లాస్ట్ వీక్ థియేట్రిక‌ల్ రిలీజ్ అయిన `కోర్ట్‌` మూవీకి బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురుస్తోంది. అన్ సీజ‌న్ లో విడుద‌లైన‌ప్ప‌టికీ ఈ చిత్రం మాస్ రాంపెజ్ ను చూపిస్తోంది. మంచి కాన్సెప్ట్ తో సాగే డీసెంట్ కోర్ట్ డ్రామాగా విమ‌ర్శకుల నుంచి ప్ర‌శంస‌లు అందుకున్న కోర్ట్ మూవీని హీరో నాని ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా క‌లిసి నిర్మించారు. హర్ష్‌ రోషన్, శ్రీదేవి, ప్రియ‌ద‌ర్శి, శివాజీ ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషించ‌గా.. రామ్ జగదీష్ ద‌ర్శ‌క‌త్వం చేశాడు. మార్చి 14న విడుద‌లైన కోర్ట్ మూవీ మెజారిటీ ఆడియెన్స్ ను పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. చందు, జాబిల్లి పాత్రలకు రోషన్, శ్రీ‌దేవి పూర్తి న్యాయం చేయ‌గా.. శివాజీ, ప్రియ‌ద‌ర్శిల న‌ట‌న సినిమా స్థాయిని పెంచింది. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ కూడా ఆక‌ట్టుకుంది. ఎక్స్ లెంట్ రివ్యూలు ద‌క్క‌డంతో కోర్ట్ మూవీ రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. మూడో రోజు మొద‌టి రోజు కంటే ఎక్కువ వ‌సూళ్ల‌ను అందుకుని వీకెండ్ ను ముగించింది. సండే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న కోర్ట్‌.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 4 కోట్లు రాబ‌ట్టింది. 3 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను గ‌మ‌నిస్తే.. ఏపీ మ‌రియు తెలంగాణ‌లో ఈ చిత్రానికి రూ. 8.61 కోట్ల షేర్‌, రూ. 15.85 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాగా.. వ‌ర‌ల్డ్ వైడ్ రూ. 12.01 కోట్ల షేర్‌, రూ. 23.25 కోట్ల గ్రాస్ ను క‌లెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 7 కోట్లు. రెండు రోజుల్లోనే ఈ టార్గెట్ ను చిత్తు చేసిన కోర్ట్ చిత్రం.. ఇప్పుడు ఏకంగా రూ. 5.01 కోట్ల లాభాలతో దూసుకెళ్తోంది.

Related News