ఢిల్లీలో బాబు `హైటెక్` గర్జన.. దిగ్గజ సంస్థలతో కీల‌క ఒప్పందాలు!

admin
Published by Admin — February 21, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మార్కు హైటెక్’ వేగాన్ని ప్రదర్శించారు. సింగపూర్ నుంచి దుబాయ్ వరకు, అమరావతి నుంచి అమెరికా వరకు ఎక్కడ ఏ చిన్న అవకాశం చిక్కినా ఏపీ ప్రయోజనాల కోసం ముందుండే బాబు, తాజాగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నిర్వహించిన `ఇండియా ఏఐ ఇంపాక్ట్` సదస్సులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఏపీని గ్లోబల్ టెక్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏఐ సదస్సుకు హాజరయ్యారు. అక్కడ ఉన్న అంతర్జాతీయ ప్రతినిధులు, ఐబీఎం వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపారు. ``ఏపీ అంటే కేవలం వ్యవసాయం కాదు.. ఏపీ అంటే ఫ్యూచర్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్`` అనే సంకేతాన్ని బలంగా పంపారు. విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్ ప్రాధాన్యతను, అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటం కంప్యూటింగ్ విశేషాలను వివరించి ఇన్వెస్టర్లను ఫిదా చేశారు.

కేవలం మాటలతో సరిపెట్టకుండా, ఆచరణలో బాబు తన స్పీడ్ చూపించారు. ఈ సదస్సు వేదికగా ఏపీ ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. క్వాంటం మరియు ఏఐ రంగాల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఏడు ప్రముఖ సంస్థలతో ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అత్యాధునిక పరిశోధనల కోసం అమెరికాకు చెందిన సంస్థతో కలిసి ఏపీలో ఒక `సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్` ఏర్పాటు కానుంది. ఏపీని దేశంలోనే అతిపెద్ద క్వాంటం-ఏఐ హబ్‌గా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ కంప్యూటింగ్ సెంటర్ ముందుకు రావడం మ‌రొక‌ విశేషం.

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైటెక్ సిటీతో ఐటీ విప్లవాన్ని తెచ్చిన చంద్రబాబు, ఇప్పుడు నవ్యాంధ్రలో ‘ఏఐ’ విప్లవానికి నాంది పలుకుతున్నారు. కేవలం పెట్టుబడులు తేవడమే కాదు, వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుని రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఢిల్లీ సదస్సులో కుదిరిన ఈ ఒప్పందాలు అమరావతి, విశాఖపట్నం నగరాలను భవిష్యత్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

Tags
Chandrababu Naidu Andhra Pradesh India AI Impact Summit Quantum Computing Amaravati
Recent Comments
Leave a Comment

Related News