హెరిటేజ్ వివాదం.. అసెంబ్లీ వేదికగా బాబు ఊచకోత!

admin
Published by Admin — February 24, 2026 in Politics, Andhra
News Image

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశ్వరూపం ప్రదర్శించారు. గత కొన్ని రోజులుగా కల్తీ నెయ్యి వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని, తమ కుటుంబ సంస్థ అయిన `హెరిటేజ్ ఫుడ్స్(Heritage Foods)`పై వస్తున్న ఆరోపణలను ఆయన ఉతికి ఆరేశారు. కేవలం మాటలతోనే కాదు, పక్కా ఆధారాలు, డాక్యుమెంట్లు మరియు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో విపక్షాల కుట్రలను బట్టబయలు చేస్తూ.. సభలో ఒక రేంజ్ ఊచకోత కోశారు.

``హెరిటేజ్ మా కుటుంబ వ్యాపారం.. అది ప్రభుత్వ అండదండలు లేకుండా, కేవలం రైతుల నమ్మకంతో, నీతి నిజాయితీలతో ఎదిగింది`` అంటూ చంద్రబాబు(Chandrababu) గంభీరంగా ప్రకటించారు. రోజూ 20 లక్షల లీటర్ల పాలను సేకరిస్తూ లక్షలాది రైతు కుటుంబాలకు అండగా నిలుస్తున్న సంస్థపై బురదజల్లడం రాజకీయ కక్షసాధింపు తప్ప మరొకటి కాదని తేల్చి చెప్పారు. ``ఇప్పటివరకు హెరిటేజ్ నుంచి ఒక్క కేజీ నెయ్యిని కూడా ఏ ప్రభుత్వ శాఖా కొనుగోలు చేయలేదు.. అలాంటప్పుడు కల్తీ నెయ్యికి మాకు సంబంధం ఎక్కడ?`` అని ప్రశ్నిస్తూ ప్రత్యర్థుల నోళ్లు మూయించారు.

ఇందాపూర్ గుట్టు విప్పిన సీఎం..!
వివాదానికి కేంద్రంగా మారిన పుణేలోని ఇందాపూర్ డెయిరీ(Indapur Dairy) గురించి అసలు నిజాలను బాబు బయటపెట్టారు. అది కేవలం హెరిటేజ్‌కు మాత్రమే కాకుండా.. అముల్, మదర్ డెయిరీ, బ్రిటానియా, పతంజలి, రిలయన్స్, డిమార్ట్ వంటి దేశీయ దిగ్గజ సంస్థలన్నింటికీ ఉత్పత్తులను సరఫరా చేసే భారీ కో-మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అని వివరించారు. అలాంటి ప్రతిష్టాత్మక సంస్థను కేవలం హెరిటేజ్‌తో ముడిపెట్టి అప్రతిష్ఠపాలు చేయాలని చూడటం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో చంద్రబాబు గత పాలకులపై సెటైర్లతో విరుచుకుపడ్డారు. ``మా సంస్థ స్వచ్ఛంగా వ్యాపారం చేస్తోంది.. కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మీ భారతీ సిమెంట్స్(Bharathi Cements) ను ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ఇతర ప్రాజెక్టులలో విచ్చలవిడిగా వాడలేదా?`` అని సూటిగా ప్రశ్నించారు. నేరస్తులు ఇతరులను దెబ్బతీయడానికి ఎలా ప్రయత్నిస్తారనే దానికి ప్రస్తుత రాజకీయాలే నిదర్శనమని మండిపడ్డారు. మొత్తానికి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు ఇచ్చిన ఈ క్లారిటీతో, హెరిటేజ్‌పై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లయ్యింది.

Tags
Chandrababu Naidu Heritage Foods AP Assembly Ghee Controversy Heritage TDP YSRCP
Recent Comments
Leave a Comment

Related News