టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న (Rashmika Mandanna) ఎట్టకేలకు ఒకటయ్యారు. ఫిబ్రవరి 26న అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి వివాహం సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ సృష్టించింది. అయితే వీరి పెళ్లి ఫోటోల్లో అందరినీ ఆశ్చర్యపరిచింది మాత్రం విజయ్-రష్మిక ధరించిన ఆభరణాలే. ఆ నగల వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రష్మిక(Rashmika) పెళ్లి కూతురిగా మెరిసిపోవడానికి వెనుక దాదాపు 10 నెలల కష్టం ఉందంటే నమ్ముతారా? అవును, ఆమె ధరించిన ప్రత్యేక ఆభరణాలను రూపొందించడానికి `శ్రీ జువెలర్స్` టీమ్ దాదాపు ఏడాది కాలం పాటు శ్రమించింది. ఆధునికతను, దక్షిణాది సంప్రదాయాలను మేళవిస్తూ మొత్తం 11 రకాల రాజసం ఉట్టిపడే ఆభరణాలను ఆమె కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒక్కో నగలోనూ సూక్ష్మమైన కళాఖండాలను తలపించే డిజైన్లు ఉండటంతో రష్మిక ఒక అపురూపమైన మహారాణిలా కనిపించింది.

ఈ పెళ్లి నగల్లో అన్నిటికంటే ఎమోషనల్ అండ్ స్పెషల్ పార్ట్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తల్లి మాధవి గారు తన కోడలికి ఇచ్చిన బహుమతి. దేవరకొండ కుటుంబ ఆచారంగా తరతరాల నుండి వస్తున్న బంగారు గాజులను ఆమె రష్మికకు అందజేశారు. ఇది కేవలం నగ మాత్రమే కాదు, ఆ కుటుంబం రష్మికను తమ ఇంటి మనిషిగా మనస్ఫూర్తిగా ఆహ్వానించిన తీరుకు నిదర్శనం. అత్తగారిచ్చిన ఆ గాజులతో రష్మిక ముఖంలో మరింత వెలుగు నిండింది.
కేవలం రష్మిక మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ కూడా తన లుక్‌తో అందరినీ కట్టిపడేశారు. అచ్చమైన తెలుగు వరుడిలా పంచె కట్టులో మెరిసిన విజయ్.. నక్షి (Nakshi) వర్క్ చేసిన సాంప్రదాయ ఆభరణాలను ధరించారు. ఈ నక్షి వర్క్ అనేది భారతీయ హస్తకళల్లో అత్యంత క్లిష్టమైనది. దేవుళ్ల ప్రతిమలు, ప్రకృతి అందాలను బంగారంలో చెక్కే ఈ శైలి విజయ్‌కు ఒక గాంభీర్యాన్ని, రాజసాన్ని తెచ్చిపెట్టింది. మొత్తానికి విరోష్(ViRosh) వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. సంప్రదాయం, కళాత్మకత మరియు కుటుంబ అనుబంధాల కలబోతగా నిలిచిపోయింది. అందుకే ఈ పెళ్లి నగలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
