ఎక్కడో ఉన్న ఇరాన్(Iran)పై మరెక్కడో ఉన్న అమెరికా(USA), ఇజ్రాయెల్(Israel)లు క్షిపణులతో విరుచుకుపడుతుంటే.. భారత్(India)పై ప్రభావం పడడం ఏంటి? అనే సందేహాలు ఉంటాయి.కానీ, ప్రపంచీకరణ ప్రభావంతోపాటు.. ఇరాన్ పై ఆధారపడిన నేపథ్యంలోను, ఆ దేశ భూభా గం, జలమార్గంపైనా ప్రపంచ దేశాలు ఆధారపడిన నేపథ్యంలో ఇరాన్ పై దాడుల ప్రభావం భారత్ సహా అనేక దేశాలపై పడుతోం ది. అయితే.. మరీ ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న నేపథ్యంలో ఆప్రభావం మరింత ఎక్కువగా భారత్‌పై పడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై దాడుల నేపథ్యంలో భారత్‌పై ఎలాంటి ప్రభావం(effect) ఉంటుందో చూద్దాం..
1) చమురు: ఇరాన్‌పై దాడి నేపథ్యంలో వెనువెంటనే భారత్‌లోని చమురు(crud oil) నిల్వలపై కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సమీక్ష చేసింది. వాస్తవానికి ఇరాన్‌పై దాడిని ఖండిస్తూనే.. దౌత్య మార్గాల ద్వారా ఆదేశంతో చర్చలు జరిపి.. ఉద్రిక్తతలను తగ్గించుకోవా లని సూచిస్తూనే మరోవైపు.. దేశంలో చమురు నిల్వలపై కేంద్రం సమీక్షించడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం.. సౌదీ సహా ఇతర చమురు దేశాల నుంచి భారత్ సమా ఆసియా దేశాలకు రవాణా అయ్యే చమురు నౌకలను ఇరాన్ నిలిపివేసింది. తమ జల మార్గంలోని `హర్ముజ్` జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. దీంతో ఈ జలసంధిలో అన్ని నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ఇది భారత్‌పై ప్రభావం చూపనుంది. అయితే.. 10 రోజుల వరకు సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.
2) విమాన ప్రయాణాలు: యుద్ధం నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌తోపాటు వాటి పరిసర దేశాలు తమ గగనతలాన్ని మూసివేశాయి. దాంతో ఢిల్లీ నుంచి ఇజ్రాయెల్ సహా మధ్యప్రాచ్య దేశాలైన అఫ్గాన్, అబుదాబి, దుబాయ్ సహా ఇతర దేశాలకు వెళ్లే అన్ని గగనతలాలు మూసుకుపోయినట్టు అయింది. ఎయిరిండియా విమానం శనివారం సాయంత్రం మధ్యంలోనే వెనక్కి తిరిగి వచ్చేసింది. దీంతో ఆయా దేశాలకు చుట్టు తిరిగి అయినా వెళ్లాలి లేదా ప్రయాణాలను రద్దు అయినా చేసుకోవాలని విమానయాన శాఖ అధికారులు చెబుతున్నారు.
3) బంగారం: ఇప్పటికే ఠారెత్తుతున్న ధరలతో భారతీయులు అల్లాడి పోతున్న బంగారం ధరలు శనివారం సాయంత్రం అమాంతం పెరిగాయి. ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో దేశంలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో బంగారం ధరలు కొండెక్కాయి. 10 గ్రాముల బంగారం ధర 7 వేల రూపాయలకు అమాంత పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం 1,73,500 రూపాయలకు చేరింది. ఇక, వెండి కూడా అదే బాటలో నడిచింది. శనివారం ఉదయం 11 గంటల వరకు బాగానే ధరలు 1 గంట నుంచి పుంజుకున్నాయి. కిలో వెండి ధర 3 లక్షల రూపాయలకు చేరిపోయింది. సో.. మొత్తంగాకీలకమైన చమురు సహా.. బంగారం, ప్రయాణాలపై ఇరాన్ ప్రభావం భారత్‌పై పడుతోంది.