విశాఖ, అరకు ప్రజాప్రతినిధులతో లోకేష్ ఆత్మీయ విందు

admin
Published by Admin — March 05, 2026 in Andhra
News Image
ఉత్తరాంధ్రలోని విశాఖపట్టణం, అరకు పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులతో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతమూ ఉల్లాసం..ఉత్సాహం నెలకొంది. ఉండవల్లి నివాసంలో బుధవారం ఇచ్చిన విందుకు రెండు పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కుటుంబసభ్యులతో కలిసి ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఒక్కో కుటుంబానికి సాదర స్వాగతం పలికిన మంత్రి లోకేష్, యోగక్షేమాలు తెలుసుకున్నారు. 
 
పిల్లలతో సరదాగా మాటలు కలిపి, బాగా చదువుకోవాలని హితవు పలికారు. సరదా సంభాషణలతో నవ్వులు విరిశాయి. అతిథులకు మంత్రి లోకేష్ స్వయంగా భోజనం ప్లేట్లు అందించారు. రాజకీయాలు ప్రస్తావన లేకుండా, కుటుంబంలో శుభకార్యంలా సందడిగా ఆత్మీయ సమ్మేళనం సాగింది. విశాఖకు గూగుల్ తీసుకురావడంలో కృషి చేసిన లోకేష్ ను అభినందిస్తూ..తాము అందించిన ఫోటో ఫ్రేమ్స్ లో వైజాగ్ లో జీ అక్షరాన్ని గూగుల్ లోగోతో డిజైన్ చేసి నేతలు అందించారు. 
 
నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై ఆయా ప్రజాప్రతినిధులు తనకు ఇచ్చిన గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టు వారికి అందజేశారు. సోదరీమణులకు తన నియోజకవర్గం చేనేత కళాకారులు నేసిన మంగళగిరి పట్టుచీరలు చిరుకానుకగా అందజేశారు. 
 
విశాఖపట్టణం పార్లమెంటు సభ్యుడు ముతుకుమిల్లి భరత్, ఎమ్మెల్యేలు పీజీవీఆర్ నాయుడు (గణబాబు విశాఖ వెస్ట్), గంటా శ్రీనివాసరావు (భీమిలి), వెలగపూడి రామకృష్ణబాబు (విశాఖ ఈస్ట్), వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖ సౌత్), విష్ణుకుమార్ రాజు (విశాఖ నార్త్), పల్లా శ్రీనివాసరావు (గాజువాక), కోళ్ల లలితకుమారి (శృంగవరపుకోట), ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, అరకు పార్లమెంటు నుంచి మంత్రి గుమ్మడి సంధ్యారాణి (సాలూరు), తోయక జగదీశ్వరి (కురుపాం), బోనెల విజయచంద్ర (పార్వతీపురం), నిమ్మక జయకృష్ణ (పాలకొండ), ఎం శిరీషాదేవి (రంపచోడవరం) కుటుంబసభ్యులతో కలిసి ఆత్మీయ విందు సమావేశానికి హాజరయ్యారు.
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
minister lokesh vizag and araku mlas and mps greet and meet dinner
Recent Comments
Leave a Comment

Related News