తమిళనాట దళపతి విజయ్ (Thalapathy Vijay) వ్యక్తిగత వ్యవహారం ఒక హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా విజయ్ తన భార్య సంగీతతో విడిపోతున్నారనే వార్తలు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విడాకుల వెనుక స్టార్ హీరోయిన్ త్రిష ఉందనే ప్రచారం దావాగ్నంలా వ్యాపిస్తోంది. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యమే విజయ్ సంసారంలో చిచ్చు పెట్టిందనే టాక్ బలంగా వినిపిస్తున్న తరుణంలో, తాజాగా చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుక ఈ పుకార్లకు మరింత ఆజ్యం పోసింది. ప్రముఖ నిర్మాత కలైపులి సురేష్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌కు విజయ్, నటి త్రిషతో కలిసి ఒకే కారులో రావడం కోలీవుడ్ లో సంచలనంగా మారింది.
సాధారణంగా విజయ్ తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. కానీ, తాజాగా త్రిష(Trisha)తో కలిసి బహిరంగంగా ఒక ఫంక్షన్‌కు హాజరుకావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వీరిద్దరూ ఒకే కారులో దిగడం, పక్కపక్కనే నడుచుకుంటూ వెళ్లడం చూస్తుంటే.. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అంటూ వస్తున్న వార్తలు నిజమేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా `లియో` సినిమా తర్వాత వీరిద్దరి కెమిస్ట్రీ వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రిపీట్ అవుతోందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‌కు, ఈ విడాకుల వ్యవహారం మింగుడు పడటం లేదు. ప్రత్యర్థి పార్టీలు ఈ అంశాన్ని అస్త్రంగా చేసుకుని విజయ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. అటు భార్య సంగీత(Sangeetha)కు దాదాపు రూ. 250 కోట్లు భరణం ఇచ్చేందుకు విజయ్ సిద్ధమయ్యారనే వార్త ఒకవైపు, ఇటు త్రిషతో ఎఫైర్ రూమర్లు మరోవైపు విజయ్‌ను ఇరకాటంలో పడేస్తున్నాయి. విజయ్ అభిమానులు సైతం తమ నాయకుడి చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలను చూసి ఆందోళన చెందుతున్నారు. ప్రజల్లో మంచి ఇమేజ్ సంపాదించుకోవాల్సిన టైమ్‌లో, ఇలాంటి వ్యక్తిగత వివాదాలు ఆయన పొలిటికల్ కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. మరి త్రిషతో కలిసి చేసిన ఈ పబ్లిక్ ఎంట్రీ విజయ్ ఇమేజ్‌ను మరింత డ్యామేజ్ చేస్తుందా లేక ఇది కేవలం ప్రొఫెషనల్ స్నేహమేనా అన్నది తేలాల్సి ఉంది.