AMANA ఇఫ్తార్ విందులో విజయ్ చవ్వాకు సన్మానం

admin
Published by Admin — March 10, 2026 in Nri
News Image

ఆంధ్ర ముస్లిం అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(AMANA) ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని విభిన్న సమాజాల మధ్య ఐక్యతను ప్రోత్సహించేలా ఈ విందు జరిగింది. పలు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, ఉద్యోగులు, వారి కుటుంబాలు ఈ విందులో పాల్గొన్నాయి. పవిత్ర రంజాన్ మాసంలోని కరుణ, ఉదారత మరియు సేవ అనే మూల విలువలను ఈ విందు ప్రతిబింబించింది.

రంజాన్ ఉపవాస దీక్షను ఆచరించే వారు ఉపవాసాన్ని విరమిండాన్ని ఇఫ్తార్ అంటారు. ఉపవాసాలలో ఇఫ్తార్ లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకచోట చేరే క్షణం ఇఫ్తార్ సమయం. కరుణ, ఐక్యత, ప్రేమ, మానవత్వపు విలువలను ఇఫ్తార్ విందు బలోపేతం చేస్తుంది. విభిన్న మతాలు మరియు సంస్కృతుల వ్యక్తులు ఒకచోట చేరి ఆహారాన్ని పంచుకుని, పరస్పర గౌరవంతో మెలగడం ఈ ఇఫ్తార్ విందు ప్రత్యేకత.

ఈ ఇఫ్తార్ విందులో YemPover సీఈఓ, ప్రముఖ కమ్యూనిటీ లీడర్ విజయ్ చవ్వాను సత్కరించారు. విభిన్న సమాజాలను కలపడం, గ్లోబల్ NRI సమాజం ద్వారా భారతదేశానికి ఆయన చేస్తున్న నిరంతర సేవలకు గుర్తింపుగా విజయ్ ను సన్మానించారు. ఈ రకంగా ప్రత్యేకంగా మొదటిసారిగా ఒక వ్యక్తికి ఇచ్చిన అవార్డును విజయ్ చవ్వా దక్కించుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ కె. శ్రీకర్ రెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును విజయ్ అందుకున్నారు.

AMANA నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (TCA) చేపట్టిన 10 సంవత్సరాల ఇఫ్తార్ సంప్రదాయాన్ని గుర్తించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2016లో కరుణ, ఐక్యత, ప్రేమ, శాంతి మరియు ఉత్సవాల ఆధ్యాత్మికతతో విభిన్న సమాజాల వ్యక్తులను ఒకచోట చేర్చాలనే ఉదాత్త దృష్టితో టీసీఏ ఆ సంప్రదాయం ప్రారంభమైంది. పరస్పర గౌరవం, అవగాహన పంచుకునేందుకు వ్యక్తులు ఒకచోట చేరడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. ఒరిజినల్ కోర్ టీమ్‌లోని చాలా మంది ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ ఇఫ్తార్ విందులు అమెరికాలోని NRI సమాజాన్ని ఒకచోట చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

భారతీయ డయాస్పోరాలోని చాలా మందికి ఇలాంటి కార్యక్రమాలు సాంస్కృతిక మరియు సామాజిక వారధులుగా నిలుస్తున్నాయి. భారతదేశంలోని విభిన్న ప్రాంతాలు మరియు విభిన్న మతాల వ్యక్తులు పరిచయమయ్యేందుకు, సామూహిక గుర్తింపు బలోపేతం చేసుకునేందుకు ఈ సమావేశాలు చక్కటి అవకాశం కల్పిస్తాయి. అమెరికా వంటి బహుసాంస్కృతిక సమాజంలో ఈ సమావేశాలు వైవిధ్యం ఐక్యత మరియు సహకారానికి శక్తివంతమైన మూలాలుగా నిలుస్తున్నాయి.

తనకు ఈ అవార్డు దక్కడంపై విజయ్ చవ్వా కృతజ్ఞతలు తెలిపారు. విభిన్న నేపథ్యాల వ్యక్తుల మధ్య సంభాషణ, పరస్పర గౌరవం పెంపొందించేందుకు ఈ తరహా సమావేశాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ నాయకత్వం మరియు కమ్యూనిటీ సేవను సమతుల్యం చేసే సామర్థ్యానికి విజయ్ గుర్తింపు పొందారు. YemPover అనే గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ కంపెనీ సీఈఓగా, వ్యాపార ట్రాన్స్‌ఫర్మేషన్ ఇనిషియేటివ్‌లను నడిపించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను నిర్మించడం మరియు వివిధ ఇండస్ట్రీలలో ఇన్నోవేషన్‌ను నడిపించడంలో రెండు దశాబ్దాల అనుభవం కలిగి ఉన్నారు.

సహకార నాయకత్వ శైలికి ప్రసిద్ధి చెందిన ఆయన, వ్యాపారాలు, భాగస్వాములు మరియు సమాజాలకు దీర్ఘకాలిక విలువను అందించే పరిస్థితులను సృష్టించడాన్ని విశ్వసిస్తారు. కార్పొరేట్ ప్రపంచానికి అతీతంగా సంస్కృతి, సంభాషణ మరియు సహకారాన్ని ప్రోత్సహించే కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్‌లను నిర్మించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ మరియు తెలంగాణ రేడియో స్థాపకుడు అయిన విజయ్ చవ్వా...సాంస్కృతిక సంరక్షణ, సామాజిక సామరస్యం మరియు డయాస్పోరాలో మానవతావిలువలతో కూడిన కార్యక్రమాలను ఎన్నో నిర్వహించారు.

గంగా-జమునా తహజీబ్ తత్వాన్ని ఆయన బలంగా నమ్ముతారు. సామరస్యం, సహజీవనం మరియు సంస్కృతుల మిశ్రమాలతో కూడిన హైదరాబాద్ మరియు తెలంగాణ సంప్రదాయాలు ఆదర్శనీయని ఆయన అభిప్రాయపడుతుంటారు. విభిన్న సమాజాలు పరస్పర గౌరవంతో జీవించడాన్ని తెలంగాణ సంస్కృతి నేర్పిందని ఆయన అభిప్రాయం.

అంకితభావం కలిగిన AMANA టీమ్ నాయకత్వంతో ఈ ఇఫ్తార్ విందు సాధ్యమైంది. అబ్దుల్ ఖుద్దూస్ (నేషనల్ ప్రెసిడెంట్); కరీముల్లా షేక్ (బే ఏరియా చాప్టర్ ప్రెసిడెంట్); మహమ్మద్ ఘౌస్ షేక్ (బే ఏరియా చాప్టర్ జనరల్ సెక్రటరీ); ఇమ్రాన్ లోధీ (బే ఏరియా చాప్టర్ ట్రెజరర్); ఉమర్ షెరీఫ్ (నేషనల్ జనరల్ సెక్రటరీ); జి. మహమ్మద్ ఇక్బాల్ (బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్); మరియు డాక్టర్ అబ్దుల్ రహీమాన్ (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్)ల నిబద్ధత మరియు నాయకత్వం వల్ల ఈ ఈవెంట్ విజయవంతమైంది.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
AMANA Vijay chavva honoured NRI iftar party
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News