క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ తో మంత్రి లోకేష్ భేటీ

admin
Published by Admin — March 12, 2026 in Andhra
News Image
క్యాప్ జెమిని సీఈవో ఐమాన్ ఇజ్జత్(Capgemini CEO Aiman Ezzat) తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (minister nara lokesh)విశాఖపట్నం(Vizag)లో భేటీ(meeting) అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి సారథ్యంలో విశాఖపట్నం ఐటీ, డేటా సెంటర్ హబ్ గా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలోనే అతిపెద్దదైన గూగుల్ డేటా సెంటర్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి.
 
ఇప్పటికే కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు విశాఖలో ల్యాండ్ అయ్యాయి. మరో మూడునెలల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. దేశంలో మరే ప్రాంతంలోని లేని ఐటీ ఎకో సిస్టమ్ విశాఖపట్నానికి మాత్రమే సొంతం. అన్నివిధాల అనుకూలతలు కలిగిన విశాఖలో 20వేల ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం గల ఐటీ డెవలప్ సెంటర్, జీసీసీ, క్లౌడ్ సర్వీసెస్, బీపిఎం వర్టికల్స్ సేవల కేంద్రాన్ని ఏర్పాటు చేయండి.
 
ఆంధ్రప్రదేశ్ లో ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్స్ (ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అభివృద్ధి, డిజిటల్ టాలెంట్ పైప్ లైన్) ఏర్పాటు కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో కలిసి కో డెవలప్ మెంట్ పార్టనర్ గా వ్యవహరించండి. క్యాప్ జెమినీ డెడికేటెడ్ క్వాంటం వర్టికల్ ను స్థాపించడమేగాక ఆప్టిమైజేషన్, ఫైనాన్సియల్ సర్సీసెస్, సస్టయినబిలిటీ వంటి రంగాల్లో ఎంటర్ ప్రైజ్ కస్టమర్ సేవల అభివృద్ధికి ప్రపంచస్థాయి సాంకేతిక భాగస్వాములతో కలిసి పనిచేయండి. ఆంధ్రప్రదేశ్ లో క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు. 
 
క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ స్పందిస్తూ... 1967లో పారిస్ కేంద్రంగా ఏర్పాటైన తమ సంస్థలో ప్రపంచవ్యాప్తంగా 3.4లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, అందులో 2లక్షల మంది వరకు ఒక్క భారత్ లోనే ఉన్నట్లు తెలిపారు. స్ట్రాటజీ & ట్రాన్సఫర్మేషన్, క్లౌడ్, డేటా & ఏఐ, డిజిటల్ ఇంజనీరింగ్, ఎంటర్ ప్రైజ్ ప్లాట్ ఫామ్స్, మేనేజ్డ్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీలో కోర్ వర్టికల్స్ సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.
 
భారత్ లోని హైదరాబాద్, చెన్నై, ముంబయి, పూనే, నోయిడా, కోల్ కతా, గురుగ్రామ్, భువనేశ్వర్ సహా 13నగరాల నుంచి తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఐమాన్ ఇజ్జత్ చెప్పారు. ఈ సమావేశంలో క్యాప్ జెమినీ ఇండియా సీఈవో సంజయ్ చాకే, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సీఈవో కేశవ్ మురుగేష్ పాల్గొన్నారు. (క్యాప్ జెమినీ సంస్థ $23.9 బిలియన్ల వార్షికాదాయం సాధిస్తోంది.
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
Capgemini CEO Aiman Ezzat minister nara lokesh meeting investment Vizag
Recent Comments
Leave a Comment

Related News