రైతులకు చంద్రబాబు గుడ్ న్యూస్

admin
Published by Admin — March 15, 2026 in Andhra
News Image
ఏపీ సీఎం చంద్ర‌బాబు(ap cm chandrababu) మ‌రోసారి రైతుల(farmers) ప‌ట్ల త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. తాజాగా 1800 కోట్ల రూపాయ‌ల‌ను(1800 crores) రైతుల ఖాతా ల్లో వేసి వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గం, సూరంపల్లిలో శుక్ర‌వారం సాయంత్రం నిర్వ‌హించిన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కూట‌మి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాల్లో కీల‌క‌మై.. `అన్నదాత సుఖీభవ`తోపాటు `పీఎం కిసాన్` 3వ విడత నిధుల ను విడుదల చేశారు. మొత్తం 2670 కోట్లను జ‌మ చేయ‌గా.. దీనిలో రాష్ట్ర స‌ర్కారు వాటాగా రూ.1874 కోట్లు ఉన్నాయి.
 
15 ఏళ్లు అండ‌గా ఉంటాం..
 
కూట‌మి ప్ర‌భుత్వం రైతుల‌కు అండ‌గా ఉంటుంద‌ని.. మ‌రో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ``ఎన్నికల ముందు నేను, పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం తిరిగి.. వైసీపీ పాల‌న‌తో ధ్వంస‌మైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని, రైతులను ఆదుకుంటామని చెప్పాం. అధికారంలోకి రాగానే సూప‌ర్ సిక్స్‌ను అమ‌లు చేస్తున్నాం. దీనిలో భాగంగానే 3వ విడత 46.85 లక్షల మంది రైతులకు 6 వేల రూపాయ‌ల‌ చొప్పున జమ చేస్తున్నాం. `` అని చంద్ర‌బాబు వివ‌రించారు. ఈ ఒక్క విడతలోనే రూ.2,670 కోట్లు అకౌంట్లో వేశామ‌ని, దీనిలో రూ.1874 కోట్లు రాష్ట్ర వాటాగా ఇచ్చామ‌ని పేర్కొన్నారు.
 
నేనూ రైతు బిడ్డ‌నే..
 
2025 ఆగస్టు 2న మొదటి విడత రూ.3,174 కోట్లు, నవంబర్ 19 రూ.3,135 కోట్లు కలిపి రూ.6309 కోట్లు ఇచ్చామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. 3వ విడత రూ.2,670 కోట్లు ఇచ్చాం. రూ.8,985 కోట్లు ఈఏడాది రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఏన్డీయేనేన‌ని వివ‌రించారు. కేంద్రం రూ.6 వేలు ఇస్తుంటే మనం రూ.14 వేలు ఇస్తున్నామ‌న్నారు. గత ప్రభుత్వం రూ.7,500 మాత్రమే ఇచ్చి అన్ని పథకాలు ఎగ్గొట్టారని విమ‌ర్శించారు. కూటమి ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి రైతులకు ఇచ్చిందన్నారు. ``నేనూ రైతు బిడ్డనే, వ్యవసాయంలో నాకు ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది. నా రైతు కుటుంబాలు ఇబ్బంది పడకూదని ఉద్దేశంతో నిత్యం అండగా నిలుస్తున్నాం`` అని చంద్ర‌బాబు తెలిపారు.
 
నీటి వివాదాలు వ‌ద్దు..
 
ఈ సంద‌ర్భంగా నీటి వివాదాల‌పై మాట్లాడిన సీఎం చంద్ర‌బాబు వివాదాలు లేకుండా జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుందామ‌ని ప‌రోక్షంగా తెలంగాణ ప్ర‌భుత్వానికి సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు బాగుండాల‌ని కోరుకునే వారిలో తానే ముందుంటాన‌ని తెలిపారు. పోలవరం కంటే ముందు పట్టిసీమ ద్వారా గోదావరి జాలలు ఇచ్చిన ఘనత త‌మ‌ ప్రభుత్వానిదేన‌ని తెలిపారు. గత పాలకుల కార‌ణంగా రాష్ట్రం అప్పుల సుడిగుండంలో ఉందన్నారు. పెట్టుబడులు పెట్టేవారు కూడా రాలేదని, బ్రాండ్ ను దెబ్బ తీశార‌ని వ్యాఖ్యానించారు. ``ఈ 20 నెలల్లో ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తు న్నాం.`` అని చంద్ర‌బాబు తెలిపారు. 
Tags
ap cm chandrababu farmers good news 1800 crores
Recent Comments
Leave a Comment

Related News