సిలికానాంధ్ర సిల్వర్ జూబ్లీ వేడుకలు..గిన్నిస్ రికార్డ్ టార్గెట్

admin
Published by Admin — March 19, 2026 in Nri
News Image

సిలికానాంధ్ర సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా శతక శంఖారావం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఈవెంట్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను టార్గెట్ చేసింది. 1800 మంది పిల్లలు మరియు పెద్దలు కలిసి 18 పద్యాలు (సుమతి శతకం నుండి 9, వేమన శతకం నుండి 9) ఏకకంఠంగా రికార్డు స్థాయిలో పఠించనున్నారు. తెలుగు పద్యాలతో మొదటిసారిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించే ప్రయత్నం చేస్తోంది సిలికానాంధ్ర. ఆగస్టు 8, 2026 శనివారం నాడు కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్ అరేనాలో ఈ ఈవెంట్  జరగనుంది.

ఆ ఈవెంట్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారి స్వయంగా హాజరు కాబోతున్నారు. ఈ రికార్డు సాధిస్తే ఈ ఈవెంట్ లో పాల్గొనేవారందరూ తమ పేరుతో వ్యక్తిగత గిన్నిస్ సర్టిఫికెట్లు (ఫీజు చెల్లించి) పొందవచ్చు.
ఈ సర్టిఫికెట్ యువకులకు కాలేజీ అప్లికేషన్లలో, అడ్మిషన్లలో ఉపయోగపడతాయి. కాబట్టి ఆసక్తి ఉన్న ఎన్నారైలు రాబోయే 5 నెలల్లో 18 పద్యాలను నేర్చుకోవడం, కంఠత పట్టడం మొదలుబెట్టండి. 15 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో తెలుగు పద్యాలు పఠించే అద్భుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ ఈవెంట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి లిరిక్స్ మరియు ఆడియో ఫైల్స్ (ప్రాక్టీస్ కోసం) వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

$ 25 రిజిస్ట్రేషన్ ఫీజుతో రోజంతా వేడుకలకు పూర్తి యాక్సెస్ లభిస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారందరూ భౌతికంగా వేదిక వద్ద హాజరు కావాలి. సిలికానాంధ్ర 25 ఏళ్ల సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించే సిలికానాంధ్ర సంస్థ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది.

ప్రాక్టీస్ ఆడియో, లిరిక్స్, మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం: https://silverjubileesiliconandhra.org/ ను సందర్శించండి....తెలుగు పద్యాలతో గిన్నిస్ రికార్డు సృష్టిద్దాం రండి!

News Image
Tags
silikanandhra targets silver jubilee celebrations Guinness book of world records
Recent Comments
Leave a Comment

Related News