ప్రధాన మంత్రినరేంద్ర మోడీ తెలంగాణకు రానున్నారు. ఏప్రిల్ రెండో వారంలో ఆయన పర్యటన ఉం టుందని ప్రధాన మంత్రి కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ మెజారిటీ భాగం ఏప్రిల్ 10తోనే ముగియను న్నాయి. పశ్చిమ బెంగాల్లో మాత్రమే ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ దఫా పశ్చిమ బెంగా ల్ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. ఈలోగానే ప్రధాని ప్రచారం ముగియనుంది.
అనంతరం.. ఏప్రిల్ 11-15 మధ్యప్రధాని మోడీ తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని ప్రధాన మంత్రి కార్యాలయం-పీఎంవో తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో కేంద్రం చేపట్టే పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇదేసమయంలో ఫ్యూచర్ సిటీకి కూడా శంకుస్థాపన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సం బంధించిన వ్యవహారం కావడంతో సీఎం అభ్యర్థన మేరకు మోడీ శంకుస్థాపన చేయొచ్చని సమాచారం.
ఇక, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జట్లో తెలంగాణకు రెండు బుల్లెట్ ట్రైన్లను ప్రకటించా రు. వీటికి సంబంధించి ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పనులకు ప్రధాని భూమి పూజ చేసే అవకాశం ఉందని తెలిసింది. అలాగే.. ఫ్యూచర్ సిటీని ఏపీలోని మచిలీపట్నానికి కనెక్ట్ చేస్తూ నిర్మించే 6 వరుసల రహదారి పనులను(ఇది కేంద్రమే నిర్మించనుంది. దీనికి అనుమతులు కూడా ఇచ్చారు.) కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.
రాష్ట్ర నేతల పనితీరుపైనా ప్రధాని ఈ సందర్భంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో బీజేపీ వ్యవహారాలు మందకొడిగా సాగుతున్నాయన్న వాదన ఉంది. దీనిని గతంలోనూ ప్రధాని ప్రస్తావించారు. తెలంగాణ, ఏపీ ఎంపీలకు ఇచ్చిన విందులో ఆయన ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించి.. సరిచేసుకోవాలన్నారు. ఈ క్రమంలో తాజా పర్యటన నేపథ్యంలో ఎంపీల పనితీరును కూడా మోడీ అంచనా వేయొచ్చని సమాచారం.