బీఆర్ ఎస్ అంత‌ర్మ‌థ‌నం: ఈ రెడ్ల‌తో పార్టీకి లాభ‌మెంత‌?

admin
Published by Admin — March 22, 2026 in Telangana
News Image

కొంత మంది నాయ‌కుల కార‌ణంగా.. బీఆర్ ఎస్ పార్టీ అభాసుపాల‌వుతోంద‌న్న చ‌ర్చ ఆ పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వాన్ని అంత‌ర్మ‌థ‌నం లో ప‌డేస్తోంది. అంద‌రూ బాగానే ఉన్నా.. కొంద‌రు చేస్తున్న `అతి` కార‌ణంగా పార్టీని తీవ్ర ఇబ్బందుల్లో ప‌డేస్తున్న ప‌రిస్థితి క‌ని పిస్తోంది. ఈ విష‌యంపైనే బీఆర్ ఎస్ అగ్ర‌నాయ‌క‌త్వం.. ఆలోచ‌న చేప‌ట్టిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా ముగ్గురురెడ్డి నాయ‌కుల‌పై మాజీ సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని.. వారితో పార్టీకి ఇబ్బందులు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్టు తెలిసింది. అయితే.. స‌ద‌రు రెడ్డి నాయ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

1) కౌశిక్‌రెడ్డి: ఫైర్ బ్రాండ్ కోసం త‌హ‌త‌హ‌లాడుతున్న కౌశిక్‌ వ్య‌వ‌హారం పార్టీకి ఎప్ప‌టిక‌ప్పుడు ఇబ్బందులు తెస్తోంద‌న్న వాద‌న ఉంది. గ‌త 2023 ఎన్నిక‌ల్లో హుజూరాబాద్ నుంచి విజ‌యం ద‌క్కించుకున్న కౌశిక్‌రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో కంటే కూడా హైద‌రాబాద్‌లోనే ఎక్కువ‌గా ఉంటున్నారు. పైగా.. ప్ర‌జ‌ల‌కు చేరువ అవ్వాల‌ని అధినేత చెబితే.. ఆయ‌న వివాదాల‌కు చేరువ అవుతుండ‌డం.. త‌ర‌చుగా పోలీసులు-కేసుల‌తో తీరిక లేకుండా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం వంటివి కేసీఆర్‌కు న‌చ్చ‌లేద‌ని అంటున్నా రు. హుజూరాబాద్‌లో మ‌ళ్లీ ఈట‌ల రాజేంద‌ర్‌వ‌ర్గం పుంజుకుంటోంద‌ని తెలిసి.. కేసీఆర్ కౌశిక్ రెడ్డిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

2) రోహిత్ రెడ్డి: తాండూరు మాజీ ఎమ్మెల్యే, ఆర్థికంగాబ‌లంగా ఉన్న రోహిత్ రెడ్డి ఇటీవ‌ల త‌న ఫామ్ హౌస్‌లో డ్ర‌గ్స్ కేసులో చిక్కుకున్నారు. అయితే.. ఆది నుంచి కేసీఆర్‌కు చ‌నువుగా ఉన్న నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. గ‌తంలో బీజేపీ త‌మ పార్టీఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు రోహిత్ ద్వారానే కేసీఆర్ క‌థ న‌డిపించారు. అయితే.. ఈ వ్య‌వ‌హారాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకున్న రోహిత్ రెడ్డి పార్టీ నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తూ.. డ్ర‌గ్స్ వంటి కేసుల్లో చిక్కుకుని.. పార్టీని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌న్న‌ది కేసీఆర్ మాట‌. ఈయ‌న‌పై త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌నికొంద‌రు నాయ‌కులు కోరుతున్న విష‌యంపై కేసీఆర్ దృష్టి పెట్టారు.

3) మ‌ల్లారెడ్డి: మ‌ల్లారెడ్డి ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయ‌న అల్లుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ, వీరి ఫ్యామిలీలో బీజేపీ వాస‌న వ‌స్తుండ‌డం.. మ‌ల్లారెడ్డి కోడ‌లు.. నేరుగా ఆన్‌లైన్ ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ.. ప్ర‌ధానిని, మోడీని, బీజేపీ విధానాల‌ను మెచ్చుకోవ‌డం.. తాను మోడీ ఫేవ‌ర్ అని ప్ర‌క‌టించ‌డం వంటివి కేసీఆర్‌కు సుత‌రాము న‌చ్చ‌డం లేదు. ``ఇలా చేస్తే.. పార్టీ ప‌రువు ఏం గాను..`` అని ఆయ‌న అన్యాప‌గా.. మ‌ల్లారెడ్డిని హెచ్చరిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో కేసీఆర్ తో చెడితే.. మ‌ల్లారెడ్డి పార్టీ మారేందుకు రెడీగా ఉన్నార‌న్న అంచ‌నాలు వ‌స్తున్న నేప‌థ్యంలో కేసీఆర్‌కు ఏం చేయాల‌న్న దానిపై మింగుడు ప‌డ‌డం లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. 

Tags
Brs leaders reddy community leaders mallareddy Kaushik reddy pilot Rohit Reddy
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News