షర్మిల ప్రశ్నలకు జగన్ జవాబిస్తారా?

admin
Published by Admin — March 25, 2026 in Politics
News Image

తాను ఆస్తుల గురించి మాట్లాడ‌డం లేదు.. కేవ‌లం వివేకానంద‌రెడ్డి హ‌త్య గురించే మాట్లాడుతున్నాన‌ని కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల(sharmila) చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆమె రెండు అంశాల‌ను ప్ర‌స్తావించారు. త‌న‌కు అన్యాయం చేశార‌ని.. త‌న సోద‌రి సునీత‌కు కూడా అన్యాయం చేశార‌ని వ్యాఖ్యానిం చారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లారు. కానీ, ప్ర‌జ‌లు వైసీపీకి వ్య‌తిరేకంగా ఓటేసినా.. ష‌ర్మిల‌ను మాత్రం స్వాగ‌తిం చ‌లేక పోయారు.

అంతేకాదు.. క‌డ‌ప‌లోనూ ష‌ర్మిల ప్ర‌భావం చూప‌లేక పోయారు. ఎంపీ స్థానానికి పోటీ చేసి ఘోరంగా ఓడిపో యారు. పైగా ఆమె ఎవ‌రినైతే.. వ్య‌తిర‌కంగా మార్చుకుని ప్ర‌చారం చేశారో.. అవినాష్‌రెడ్డిని ప్ర‌జ‌లు గెలిపిం చారు. స‌రే.. ఈ విష‌యం ఎలా ఉన్నా.. మ‌రోసారి తాను వివేకా హ‌త్య(viveka's murder) గురించే మాట్లాడుతున్నాన‌ని చెబు తున్నారు. దీనికి జ‌గ‌న్ స‌మాధానం చెప్పాల‌న్న‌ది ఆమె డిమాండ్‌. కానీ.. వాస్త‌వానికి ఈ కేసు విచారణను సీబీఐ ఇప్ప‌టికే పూర్తి చేసింది. దీనిలో ఎవ‌రి వాద‌న‌లు వారికి ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల ఇప్పుడు జ‌గ‌న్‌ను ఒత్తిడి చేయ‌డం.. ఆయ‌నేదో చెప్పాల‌ని కోర‌డంలో రాజ‌కీయం త‌ప్ప‌.. వాస్త‌వ ప్ర‌యోజ‌నం ఉంటే మంచిదే. కానీ.. ఆ త‌ర‌హాలో ఆమె వ్యాఖ్య‌లు చేయ‌డం లేదు. ఇప్ప‌టికే సీబీఐ విచార‌ణ చేసిన నేప‌థ్యంలో దీనిని మ‌రోసారి విచారించాల‌ని సునీత కోరిన‌ప్ప‌టికీ.. ``ఇంక విచారించేందుకు ఏమీ లేదు`` అని సీబీఐ చెప్పేసింది. ఇలాంటి స‌మ‌యంలో జ‌గ‌న్ (jagan)స్పందించి ఏం చేస్తారు?  స్పందించ‌క‌పోయినా.. స్పందించినా.. ఈ కేసులో జ‌ర‌గాల్సిన విచార‌ణ జ‌రిగిపోయింది.

కానీ.. ష‌ర్మిల జ‌గ‌న్‌ను ఇంకా ప‌ట్టుబ‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు ఆమె కొన్ని ప్ర‌శ్న‌లు కూడా సంధిస్తున్నారు. మ‌రి వాటికి జ‌గ‌న్ స‌మాధానం చెబుతారా?  లేదా అనేది చూడాలి. స‌మాధానం చెప్ప‌క‌పోతే.. ష‌ర్మిల‌.. వెంటాడుతూనే ఉంటార‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. సీబీఐ విచార‌ణ ముగిసిన త‌ర్వాత‌.. కూడా ఆమె ప్ర‌శ్నిస్తున్నారంటే.. ఈ కేసును మ‌రింత బ‌లంగా ముందుకు తీసుకువెళ్లాల‌నే భావిస్తున్నారు. కాబ‌ట్టి జ‌గ‌న్ కొన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చేయ‌డ‌మే బెట‌ర్‌.

ఇవీ.. ష‌ర్మిల ప్ర‌శ్న‌లు..
+ నాడు గుండెపోటు వార్త‌ల సృష్టి క‌ర్త ఎవ‌రు?
+ సాక్షి టీవీలో వాటిని ప్ర‌చారం చేసింది ఎవ‌రు?  ఆదేశించింది ఎవ‌రు?
+ ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను తుడిచేయాల‌ని ఎవ‌రు తొంద‌ర చేశారు?
+ సునీత హైద‌రాబాద్ నుంచి క‌డ‌ప చేరుకునేలోపే శ‌వాన్ని ఖ‌న‌నం చేయాల‌ని ఎందుకు అనుకున్నారు?
+ దీని వెనుక ఉన్న‌దెవ‌రు?  ఆదేశించింది ఎవ‌రు?
+ క‌డ‌ప ఎంపీ టికెట్‌ను అవినాష్‌కు వ‌ద్ద‌ని వివేకా చెప్పారా లేదా?
+ ఆరోప‌ణ‌లు ఉన్న‌ప్ప‌టికీ.. 2024లో అవినాష్‌కే ఎందుకు టికెట్ ఇచ్చారు?
+ ముందు సీబీఐ కావాల‌ని.. త‌ర్వాత వ‌ద్ద‌ని ఎందుకు చెప్పారు?
+ ఈ కేసులో మేనేజ్ అయ్యిందెవరు?  చేసిందెవ‌రు?

Tags
jagan sharmila ys avinash reddy viveka's murder case questions answers
Recent Comments
Leave a Comment

Related News