ఆ విషయంలో సుప్రీం సంచలన తీర్పు

admin
Published by Admin — March 25, 2026 in National
News Image

దేశంలో మ‌త మార్పిడిలు స‌హ‌జంగా మారాయి. ఒక మతం నుంచి ఇంకో మ‌తం తీసుకునేవారి సంఖ్య గ‌త రెండేళ్ల కాలంలో 5 శాతం పెరిగింద‌ని స‌ర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, గోవా, పుదుచ్చేరి, ఢిల్లీ స‌హా.. ప‌లు రాష్ట్రాల్లో క్రిస్టియానిటీలోకి మారుతున్న‌వారు పెరుగుతు న్నారు. అయితే.. ఇలాంటి వారికి షాకిస్తూ.. సుప్రీంకోర్టు(supreme court) తాజాగా సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. మ‌తం(caste) మారే వారికి రిజ‌ర్వేష‌న్‌(reservation)లు వ‌ర్తించ‌వ‌ని పేర్కొంది.

హిందువులు అయినా.. ఇత‌ర మ‌త‌స్థులు అయినా.. వారి మ‌తాన్ని వ‌దిలి.. క్రిస్టియానిటీ(christianity)గా మారితే.. ఎస్సీ.. ఎస్టీ వంటి కీల‌క‌మైన రిజ‌ర్వేష‌న్‌ను వ‌దులుకోవాల్సి ఉంటుంద‌ని ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వా రం చ‌రిత్రాత్మ‌క తీర్పును వెలువ‌రించింది. ముఖ్యంగా ఎస్సీ హిందువులుగా ఉన్న‌వారికి మాత్ర‌మే రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు ద‌క్కుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. అలాంటి వారు క్రిస్టియానిటీలోకి మారితే.. ఎలాంటి రిజ‌ర్వేష‌న్ కూడా వారికి వ‌ర్తించ‌ద‌ని పేర్కొంది. అంతేకాదు.. విద్య‌, ఉద్యోగాల విష‌యంలోనూ వారికి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

ఒక‌వేళ‌.. పుట్టుక‌తో వ‌చ్చిన కులాన్ని, స‌ర్టిఫికెట్ల‌ను అడ్డం పెట్టుకుని ఉద్యోగాలు సంపాయించే ప్ర‌య‌త్నం చేసినా.. ఎస్సీ, ఎస్టీ చ‌ట్టం ప్ర‌కారం ల‌బ్ధి పొందాల‌ని ప్ర‌య‌త్నించినా.. అది నేరమే అవుతుంద‌ని పేర్కొన డం గ‌మ‌నార్హం. మ‌తం మారిన త‌ర్వాత‌.. వారు ఆ మ‌తానికి సంబంధించిన వ్య‌క్తులే అవుతార‌ని.. క్రిస్టియానిటీలో విభాగాలు లేనందున‌.. వారిని జ‌న‌ర‌ల్ కేట‌గిరీలోనే చూడాల్సి ఉంటుంద‌ని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేర‌కు తీర్పు ఇచ్చింది.

ఏపీలోని బాప‌ట్ల జిల్లా కు చెందిన ఆనంద్‌.. పుట్టుక‌తో ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి. అయితే.. ఆయ‌న కొన్నాళ్ల కింద‌ట‌.. పాస్ట‌ర్‌గా మారారు. చ‌ర్చిని నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న చ‌ర్చి నిర్మాణానికి భూమిని ఆక్ర‌మించుకున్నార‌న్న ఫిర్యాదులు వ‌చ్చాయి. దీనిపై ప‌లువురు ఆయ‌న‌ను ప్ర‌శ్నించ‌డంతో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఆనంద్ వారిపై కేసులు పెట్టారు. అయితే.. ఆయ‌న మ‌తం మారిన నేప‌థ్యంలో `కులం` వ‌ర్తించ‌ద‌ని పేర్కొంటూ బాధితులు తొలుత హైకోర్టును ఆశ్ర‌యించారు. వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. దీంతో ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌గా.. తాజాగా కీల‌క తీర్పు వెలువ‌డింది.

Tags
sc reservtions supreme court land mark verdict christianity
Recent Comments
Leave a Comment

Related News