ఏం చేశామ‌న్న‌ది కాదు.. ఏం చేస్తున్నామో చెప్పండి: లోకేష్ పిలుపు

admin
Published by Admin — March 28, 2026 in Politics
News Image
``ఏం చేశామ‌న్న‌ది కాదు.. ఏం చేస్తున్నామో చెప్పండి`` అంటూ.. టీడీపీ శ్రేణుల‌కు మంత్రి, ఆ పార్టీ జాతీ య ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  నారా  లోకేష్(lokesh) పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఊరూవాడా సంబ‌రాలు చేయ‌డానికే ప‌రిమితం కావొద్ద‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌తి ఇంటికీ వెళ్లి.. ప్ర‌భు త్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాలపై ఆరా తీయాలని సూచించారు. అంతేకాదు.. ప్ర‌తి ఒక్క‌రూ ప‌ది మందిని క‌లిసి ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించాల‌న్నారు.

``పార్టీ ఆవిర్భావం అంటే.. కేవ‌లం జెండా ఎగ‌రేసి.. ద‌ణ్ణం పెట్ట‌డం కాదు. పార్టీ త‌ర‌ఫున ప్ర‌భుత్వం త‌రఫు న వాయిస్ వినిపించాలి. మీరు చెప్పే మాట వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ప్ర‌జ‌లు గుర్తుంచుకునేలా ఉండాలి.`` అని మంత్రి సూచించారు. టీడీపీ 45వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని భారీ ఎత్తున కార్యక్ర మాలు నిర్వ‌హించేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధ‌మ‌య్యారు. వాస్త‌వానికి శ‌నివారం ప్ర‌త్యేక అసెంబ్లీ సెష‌న్ లేక‌పోతే.. శ‌నివారం కూడా భారీ ఎత్తున కార్య‌క్ర‌మాలు జ‌రిగి ఉండేవి.
 
ఇక‌, ఆదివారం జ‌ర‌గ‌నున్న వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని కేవ‌లం జెండాలు ఎగ‌రేయ‌డంతోనో.. ర‌క్త‌దాన శిబిరా ల నిర్వ‌హ‌ణ‌తోనో స‌రిపుచ్చ‌కుండా.. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుసుకోవాల‌ని మంత్రి లోకేష్ పార్టీ నాయ‌కుల‌కు, కార్యక‌ర్త‌ల‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు.. ప్ర‌తి కార్య‌క‌ర్త‌, నాయ‌కుడు కూడా త‌మ త‌మ ఇళ్ల‌పై పార్టీ ప‌సుపు జెండాను ఎగుర‌వేయాల‌ని పిలుపునిచ్చారు. పార్టీ సాధించిన విజ‌యాల‌తోపాటు భ‌విష్య‌త్తు వ్యూహాలు.. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌పైనా అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ ఆయా కార్య‌క్ర‌మాల‌ను భిన్నంగా నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. 
 
ప్ర‌తి ఒక్క‌రూ ఆయా కార్య‌క్ర‌మాల‌ను భిన్నంగా నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు. ``తెలుగువారి ఆత్మగౌరవం కోసం టీడీపీ పుట్టి 44 ఏళ్లయింది. ఆవిర్భావ స్పూర్తి, ఐకమత్యం చాటే సమయం ఇది. రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమానికి సంకేతమైన పసుపు జెండా ప్రస్థానం. కార్యకర్తలు త‌మ‌త‌మ ఇంటిపై పార్టీ జెండా ఎగరేసి తెలుగువాడినని గర్వంగా చాటాలి. ప్ర‌జ‌ల కోసం అంకిత‌భావంతో ప‌నిచేస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేయాలి`` అని నారా లోకేష్‌ పిలుపునిచ్చారు. 
Tags
nara lokesh tdp cadre welfare schemes promotion
Recent Comments
Leave a Comment

Related News