వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన అజ్ఞానపు వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా రాసి లేదని జగన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
“దేశాలకు మాత్రమే రాజధాని ఉంటుంది. రాష్ట్రాలకు రాజధాని ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదు” అని జగన్ అన్నారు.
దీనిని ఆధారం చేసుకుని చంద్రబాబు అమరావతికి చట్టబద్ధత అంటూ డ్రామాలు చేస్తున్నారని, దోపిడీ పాలనను కప్పిబుచ్చడానికే ఇలా చేస్తున్నారని జగన్ విమర్శించారు.
అయితే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత నెటిజన్లు జగన్ ను తీవ్రంగా ఎద్దేవా చేస్తున్నారు. “రాష్ట్రానికి రాజధాని లేదని తెలిసిన జగన్, తన పాలనలో మూడు రాజధానులు అంటూ అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ఐదేళ్లపాటు డ్రామాలు ఎందుకు ఆడారు?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.