ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై లోకేశ్ అసహనం

admin
Published by Admin — April 09, 2026 in Politics
News Image

టీడీపీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. క్రమ శిక్షణ ఉన్న కార్యకర్తలను, నేతలను నెత్తిన పెట్టుకోవడ, అదే సమయంలో క్రమ శిక్షణతో లేెని నాయకులపై కొరడా ఝుళిపించడం సీఎం చంద్రబాబుకు అలవాటు. అదే బాటలో ఆయన తనయుడు నారా లోకేశ్ కూడా పయనిస్తున్నారు. క్యాడర్‌ భేటీలు, గ్రీవెన్స్‌ కార్యక్రమాలు నిర్వహించని కొందరు నాయకులపై లోకేశ్ ఫైర్ అయ్యారు. అలా చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, మాధవీ రెడ్డి, వరదరాజులు రెడ్డిలపై లోకేశ్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

వరుసగా 4 వారాలు కేడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించకపోవడం పట్ల లోకేశ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. వారు ఆ కార్యక్రమాలు నిర్వహించకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారట లోకేశ్. మరోవైపు, ‘మై టీడీపీ యాప్’ టాప్ 10 పెర్ఫార్మర్స్ తో మంత్రి లోకేష్ ఆత్మీయ భేటీ నిర్వహించి వారిని సన్మానించారు. కష్టపడిన వారిని గుర్తించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పారు. పనితీరే ఇక్కడి వరకు రావడానికి కారణం అని చెప్పారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుందని లోకేశ్ అన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

Tags
lokesh tdp 3 tdp mlas warning
Recent Comments
Leave a Comment

Related News