వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న(Buddha venkanna) ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్(mavigun) సూత్రాన్ని చూసి ప్రజలు ఛీ కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి వంత పాడుతున్న వందమా దిగల తీరును వేమూరి రాధాకృష్ణ చెప్పారని తెలిపారు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన జగన్ మావిగన్ ట్రోల్స్ నుంచి తప్పుకునేందుకు రాధాకృష్ణ మీద పడ్డాడని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు, లోకేష్ లకు ఆంధ్రజ్యోతికి ఏంటి సంబంధమని బుద్ధా ప్రశ్నించారు. పత్రికా కార్యాలయం పై దాడి చేస్తే ఖండించకూడదా? అని ప్రశ్నించారు. రాధాకృష్ణ పై దాడి చేస్తా, అరెస్టు చేస్తా అని బెదిరిస్తావా? అని నిలదీశారు. ముందు నీ సాక్షిలో రాసిన నీచపు రాతలకు నిన్ను ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు అరెస్టు చేయాలి.. అని ప్రశ్నించారు. ``నీ తల్లి విజయమ్మ నీ గురించి లేఖ రాస్తే నీ పత్రికలో రాశావా. అమరావతి మహిళలు వేశ్యలు అంటే.. సాక్షిలో రాశారు. భారతీరెడ్డి వాళ్లకు క్షమాపణ లు ఎందుకు చెప్పలేదు.`` అని ప్రశ్నించారు.
``అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు సతీమణిని అవమానిస్తే మద్దతు పలికింది నీవు కాదా. ఇప్పుడు వైసీపీ వారి గురించి మాట్లాడితే.. చంద్రబాబు, లోకేష్ ఖండించ లేదని మాట్లాడే హక్కు నీకు ఉందా.. సొంత చెల్లి నే తిట్టించిన నువ్వా మహిళల హక్కుల గురించి మాట్లాడేది. నీ మావిగన్ ట్రోల్స్ కాకుండా ఉండేందుకే రాధాకృష్ణ పై బురద జల్లుతున్నావు. నీవు చెప్పినట్లు రాయని చానల్స్, పత్రికలను బెదిరిస్తావా? నీ పాదయాత్రతో చంద్రబాబు కు సినిమా చూపిస్తావా? గతంలో రాంగోపాల్ వర్మతో నువ్వు సినిమాలు తీయిస్తే ప్రజలే ఛీ కొట్టారు.`` అని నిప్పులు చెరిగారు.
ఫ్లెక్సీల కలకలం!
తాడేపల్లిలోని జగన్(jagan) నివాసం వద్ద.. `జగన్ 2.0 మావిగన్ ఫ్లెక్సీ`లు, హోర్డింగులు ఏర్పాటు చేయడం కలక లం సృష్టించాయి. రాజధాని అమరావతి వద్దు మూడు జిల్లాల మావిగన్ అభివృద్ధి సాధ్యం అంటూ .. ఈ ఫ్లెక్సీ లలో పేర్కొన్నారు. అంతేకాదు.. ``యువతకు ఆదర్శం... సమాజానికి అండ మావిగన్. తాడేపల్లిలో వన్ పార్టీ,వన్ ఫ్లాగ్, వన్ అజెండా,,, మావిగన్ @ 2029`` నినాదాలతో వైసీపీకి చెందిన ఏలూరి శివాజీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.