22 నెల‌ల్లో 9.62 ల‌క్ష‌ల ఉద్యోగాలు

admin
Published by Admin — April 11, 2026 in Andhra
News Image

ఏపీలో కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన 22 మాసాల కాలంలో 9.62 ల‌క్ష‌ల మంది నిరుద్యోగ యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించిన‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. మొత్తం 9.36 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర‌కు పెట్టుబ‌డులు పెట్టేవారికి అనుమ‌తులు ఇచ్చామ‌న్నారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో మ‌రిన్ని పెట్టుబ డుల‌కు ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్టు పేర్కొన్నారు. తాజాగా శుక్ర‌వారం జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో పెట్టుబ‌డుల‌పై సుదీర్ఘ చ‌ర్చ చేశారు.

అదేస‌య‌మంలో ఈ నెల 28న విశాఖప‌ట్నంలో గూగుల్ డేటా కేంద్రానికి శంకుస్థాప‌న చేసే ఫైలును కూడా మంత్రి వ‌ర్గం ఆమోదించింది. ఈ డేటా ప్రాజెక్టు రాక‌తో.. సుమారు ల‌క్ష మందికి ఉపాధి ఉద్యోగాలు ల‌భిస్తా య‌ని చంద్ర‌బాబు తెలిపారు. దీని కోసం దేశంలోని అనేక తీర‌ప్రాంత రాష్ట్రాలు పోటీ ప‌డిన‌ప్ప‌టికీ.. ఏపీకి ద‌క్క‌డం వెనుక ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ స‌హ‌కారం ఉంద‌న్నారు. ఈ ప్రాజెక్టు ఉత్త‌రాంధ్ర‌కు మ‌రింత ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటున్నారు.

తాజా స‌మావేశంలో మ‌రిన్ని ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు తెలిపారు. వీటిలో విశాఖలో కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయించే అంశానికి అనుమ‌తి తెలిపారు. అలాగే.. శ్రీ సత్యసా యి జిల్లాలో ఔట్‌సోర్స్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటు చేయ‌డానికి మంత్రి వ‌ర్గం ఏక‌గ్రీవంగా అనుమ‌తి ఇచ్చింది. అలాగే.. ఆర్‌ఆర్‌ ఎలక్ట్రానిక్స్‌కు 60 ఎకరాల భూమి కేటాయించే విష‌యానికి కూడా అనుమ‌తి ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా మంత్రుల ప‌నితీరును చంద్ర‌బాబు మ‌రోసారి వివ‌రించారు

Tags
9.62 lakh jobs in 22 months ap government
Recent Comments
Leave a Comment

Related News