వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి ఏకైక రాజధా నిగా శాశ్వత రాజధానిగా అమరావతి ఉంటుందన్నారు. ఈ విషయంలో కేంద్రంలోని పెద్దలు సహా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా సమర్థిస్తున్నారని తెలిపారు. కానీ, ఒక్క వైసీపీనే తెలుగు వారి ఓట్ల కోసం ఎదురు చూస్తూ.. అదే తెలుగువారికి ద్రోహం చేస్తోందని వ్యాఖ్యానించారు.
జగన్ ప్రస్తావించిన మావిగన్ పేలని తుపాకీగా మారిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావ తిని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయడమే.. జగన్‌కు చెంపపెట్టు అవుతుందన్నారు. ప్రజలు ఈ మావి గన్ ప్రకటనను పట్టించుకోలేదన్నారు. జగన్‌కు చేసే పిచ్చివ్యాఖ్యలను ప్రజలు పక్కన పెడుతున్నారన్న చంద్రబాబు రాజధానిగా అమరావతిని చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అభివృద్ధి అనేది ఒక చోట ఆగేది కాదని.. చంద్రబాబు తెలిపారు. నిరంతరంగా కొనసాగుతుందన్నారు. చిన్నప్పుడున్నట్టుగా ఇప్పుడు ఉంటామా? అని ప్రశ్నించారు. ప్రజల్లోనూ ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తులు ఎదుగుతున్నట్టుగానే అభివృద్ధి కూడా నిరంతరం మారుతుందని.. ఇదొక నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్, సైబరాబాద్ మాదిరిగానే.. ఇప్పుడు అమరావతి కూడా అభివృద్ది చేస్తానని చెప్పారు.
ఈ విషయంలో కొందరు సృష్టింలో గందరగోళం లో ప్రజలు చిక్కుకోవద్దన్నారు. అమరావతి అందరిదీ అని పేర్కొన్నారు. దీనిలో అందరి భాగస్వామ్యం ఉంటుందన్నారు. ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేస్తున్నా మని..ఎక్కడా వివక్ష చూపించే ప్రశ్నే లేదన్నారు. రాష్ట్రానికి కేంద్రంగా ఉన్న అమరావతి.. అటు శ్రీకాకుళం నుంచి వచ్చేవారికి ఇటు అనంతపురం నుంచి వచ్చేవారికి కూడా సెంటర్‌గా మారుతుందని.. త్వరలోనే నిర్మాణాలు పూర్తవుతాయని చంద్రబాబు చెప్పారు.