ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: లోకేశ్

admin
Published by Admin — April 16, 2026 in Andhra
News Image

టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేశ్(lokesh) ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై సీఎం చంద్రబాబు(chandrababu) పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని లోకేశ్ అన్నారను. అంతేకాదు, తనకు ఈ అవకాశం రావడానికి కారణమైన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  కార్యకర్తల త్యాగాల వల్లే 94 శాతం సీట్లతో కూటమి అధికారంలోకి రాగలిగిందని అన్నారు. తప్పుడు కేసులతో కార్యకర్తలను వేధించిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని చంద్రగిరి టీడీపీ కార్యకర్తలకు భరోసానిచ్చారు.

 
పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కష్టపడతానని లోకేశ్ చెప్పారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం 90 రోజుల కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. అందుకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులతో భేటీ అయి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఇంటర్ ఫలితాలలో మెరుగుదల సాధించామని లోకేశ్ అన్నారు. 
 
ఏపీకి కాబోయే సీఎం లోకేశ్(to be cm lokesh) అని, ఆ క్రమంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇప్పుడు చంద్రబాబు అవకాశం కల్పించారని టీడీపీ (tdp)శ్రేణులు అంటున్నాయి. చంద్రబాబు వారసుడిగా పార్టీ పగ్గాలు చేపట్టేందుకు లోకేశ్ కు ఇదే సరైన సమయమని అంటున్నారు.
Tags
lokesh to be cm trust tdp working president cm chandrababu
Recent Comments
Leave a Comment

Related News