జ‌గ‌న్‌ది నిజంగా సైకోయిజ‌మే: లోకేష్

admin
Published by Admin — April 16, 2026 in Andhra
News Image

వైసీపీ అధినేత జ‌గ‌న్‌(jagan) పై మంత్రి, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్(tdp national working president) తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. జ‌గ‌న్‌ది మామూలు సైకోయిజం కాద‌ని.. ఆయ‌న సైకోయిజానికి అంతు లేద‌ని వ్యాఖ్యానిం చారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు వ‌స్తాయంటే స‌హించ‌లేర‌ని.. యువ‌త‌కు ఉద్యోగాలు వ‌స్తాయంటే ఓర్వ‌లేక పోతున్నార‌ని మంత్రి లోకేష్ ఆక్షేపించారు. ఇలాంటి నాయ‌కుడు రాష్ట్రంలో ఉండడం అభివృద్దికి విఘా తమని పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

జ‌గ‌న్‌.. బుధ‌వారం నెల్లూరు జిల్లా జువ్వ‌ల‌దిన్నె ఫిషింగ్ హార్బ‌ర్‌లో పర్య‌టించారు. ఈ హార్బ‌ర్‌లో కొంత భా గాన్ని ప్రైవేటు డిఫెన్స్ సంస్థ‌కు లీజుకు ఇచ్చే ప్ర‌తిపాద‌న‌ను జ‌గ‌న్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఇలా చేయ డం అంటే.. మ‌త్స్య‌కారుల పొట్ట కొట్ట‌డ‌మేన‌ని వ్యాఖ్యానించారు. త‌మ హ‌యాంలో అభివృద్ధి చెందాయ న్న‌కార‌ణంతో.. ఇప్పుడు హార్బ‌ర్ల‌ను ప్రైవేటుకు ధారాద‌త్తం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తాము అధికారం లోకి రాగానే.. స‌ద‌రు సంస్థ‌ను త‌రిమి కొట్టి మ‌త్స్య‌కారుల‌కు మేలు చేస్తామ‌న్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌పైనే మంత్రి లోకేష్ తాజాగా స్పందించారు. హార్బ‌ర్‌లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు ప్రైవేటు డిఫె న్స్ సంస్థతో వెయ్యి మంది మ‌త్స్య‌కార యువ‌త‌కు ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని తెలిపారు. కానీ, ఉద్యోగాలు, అభివృద్ధి ప‌ట్ట‌ని జ‌గ‌న్‌.. కంపెనీల‌ను త‌రిమి కొడ‌తాన‌ని వ్యాఖ్యానిస్తుండ‌డం.. ఆయ‌న‌లోని సైకోయిజానికి ఉదాహ‌ర‌ణ అని పేర్కొన్నారు. జ‌గ‌న్ మామూలు సైకో కాద‌ని వ్యాఖ్యానించారు.

``తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు. దైవం ప‌ట్ల‌ భక్తి లేదు.. దేశం అంటే ద్వేషం..! రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటారు.. ఉద్యోగాలు వ‌స్తాయంటే ఉసూరుమంటూ ఏడుస్తారు..! నిలువెల్లా స్వార్థం, మ‌న‌సంతా విధ్వంసంతో, 'ర‌ప్పా ర‌ప్పా న‌రుకుతాం.. అమ‌రావ‌తిని మార్చేస్తాం.. క‌ట్టిన‌వ‌న్నీ కూల్చేస్తాం.. కంపెనీల‌న్నీ వెళ్ల‌గొడ‌తాం..!' అంటూ ఏమిటీ దుర్మార్గ పనులు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారూ..?`` అని లోకేష్ వ్యాఖ్యానించారు.

దేశ రక్షణకు అధునాత‌న‌ బోట్లు తయారుచేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగ‌తించాల్సింది పోయి.. త‌రిమేస్తానంటారా..? ఇదేం రాక్ష‌స మ‌న‌స్త‌త్వం..? అని ప్ర‌శ్నించారు. మత్స్యకారుల పిల్ల‌ల‌కు మెరుగైన వెయ్యికి పైగా ఉద్యోగాలు వ‌స్తాయంటే.. ఆనందించాల్సింది పోయి, అడ్డుకుంటాన‌న‌డం ముమ్మాటీకీ సైకోయిజ‌మే అవుతుంది.. అని విమ‌ర్శించారు.

Tags
tdp national working president lokesh ap ex cm jagan psycho shocking comments
Recent Comments
Leave a Comment

Related News