మ‌రింత త‌గ్గిన జ‌గ‌న్ గ్రాఫ్‌!

admin
Published by Admin — April 16, 2026 in Politics, Andhra
News Image
వైసీపీ అధినేత జ‌గ‌న్ గ్రాఫ్ పెరుగుతోంద‌ని.. ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. `క‌ళ్లు మూసి తెరిచే లోగా మూడేళ్లు గ‌డిచి పోతాయి.. ఆ వెంట‌నే మ‌న‌ ప్ర‌భుత్వం వ‌చ్చేస్తుంది.`` అని జ‌గ‌న్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఇదంత ఈజీకాద‌ని తాజాగా రెండు కీల‌క స‌ర్వేలు వెల్ల‌డించాయి. వీటిలో ఒక ప్ర‌ముఖ స‌ర్వే సంస్థ కావ‌డం గ‌మ‌నార్హం. గ‌త 24 మాసాల్లో జ‌గ‌న్ గ్రాఫ్ పెరిగిందా?  త‌గ్గిందా? అనే విష‌యంపై జ‌రిగిన ఈ స‌ర్వేలో ప్ర‌జ‌లు స్పందిస్తూ.. జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్యానించారు.

ఫ‌లితంగా జ‌గ‌న్ ఓటు బ్యాంకు 40 శాతం నుంచి  36 శాతానికి తగ్గింద‌ని స‌ర్వేలు స్ప‌ష్టం చేశాయి. వాస్త‌వాని కి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌పై జ‌గ‌న్ చాలానే ఆశ‌లు పెట్టుకున్నారు.  అందుకే.. ప‌దే ప‌దే త‌మ ప్ర‌భుత్వం వ స్తుంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, జ‌గ‌నే.. జ‌గ‌న్‌కు శ‌త్రువు అన్న విష‌యం మ‌రోసారి రుజువైంది. నిర్ణ‌యా త్మక విష‌యాల్లో ఆయ‌న వేస్తున్న అడుగులు.. ప్ర‌జ‌ల‌కు న‌చ్చ‌డం లేదు. ముఖ్యంగా మూడు కార‌ణాల‌తో ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నార‌ని స‌ర్వేలు పేర్కొంటున్నాయి.

1)  కూటమి:  కూట‌మి ఐక్య‌త‌ను మెజారిటీ ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు. టీడీపీ+జ‌న‌సేన క‌లిసి క‌ట్టుగా ఉంటే.. ఇక‌, తిరుగు ఉండ‌ద‌ని భావిస్తున్నారు. ఇది జ‌గ‌న్‌కు ఇబ్బందిగా మార‌నుంది. కూట‌మి విచ్ఛిన్నం కూడా ఉండ‌ద‌ని స్ప‌ష్టం కావ‌డంతో ప్ర‌జ‌ల్లోనూ జ‌గ‌న్‌పై సానుభూతి పెర‌గ‌డం లేదు.

2) డుమ్మా:  వైసీపీ స‌భ్యులు అసెంబ్లీకి వెళ్ల‌క‌పోవ‌డాన్ని మెజారిటీ ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించ‌కుండా.. ఇంటికే ప‌రిమితం కావ‌డాన్ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ముఖ్యంగా స‌భ‌ల‌కు రావాలని.. కూట‌మి ప‌క్షం పిలుస్తున్నా.. జ‌గ‌న్ వితండ‌వాదం.. మొండివైఖ‌రిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది కూడా వైసీపీకి మైన‌స్ అయింది.

3) నిర్ణ‌యాలు:  రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ నిర్ణ‌యాల‌ను అంద‌రూ త‌ప్పుబ‌డుతున్నారు. నిల‌క‌డ‌లేని నిర్ణ‌యాలు స‌రికాద‌ని అంటున్నారు. మూడు రాజ‌ధానులు అని చెప్పి.. మావిగ‌న్‌గా మాట మార్చార‌ని.. అదేదో రాజ‌ధానిగా అమ‌రావ‌తినే గుర్తిస్తే బాగుండేద‌ని అంటున్నారు. జ‌గ‌న్ వ‌స్తే.. రాజ‌ధానిని ఏమైనా చేస్తాడ‌ని 72 శాతం మంది ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.
Tags
jagan's graph ycp decline jagan's image
Recent Comments
Leave a Comment

Related News