వైసీపీ అప‌చారం.. కూట‌మి ఉప‌చారం!

admin
Published by Admin — April 16, 2026 in Politics
News Image
వైసీపీ హ‌హాంలో జ‌రిగిన ఒక భారీ అప‌చారాన్ని కూట‌మి ప్ర‌భుత్వం స‌రిచేసింది. వైసీపీ పాల‌న‌లో ప‌లు హిందువుల దేవాల యాల‌పై దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అంత‌ర్వేది ల‌క్ష్మీన‌రసింహ‌స్వామి వారి ఆల‌యానికి చెందిన ర‌థం ద‌గ్థంతో మొద లైన ఈ వ్య‌వ‌హారం... విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ఆల‌య ర‌ధానికి ఉన్న వెండి సింహాల దొంగ‌త‌నం వ‌ర‌కు అనేక ఘ‌ట‌న‌లు జ‌రిగా యి. వీటిలో అంద‌రినీ మ‌రింత ఎక్కువ‌గా క‌ల‌చి చేసింది.. దేశ‌వ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళ‌న‌కు దారితీసేలా చేసింది.. విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రామ‌తీర్థం ఆల‌యంలో జ‌రిగిన దారుణం.
 
2022-23 మ‌ధ్య‌కాలంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని రామ‌తీర్థంలో ఉన్న రామాల‌యంలో శ్రీరాముల వారి విగ్ర‌హం త‌ల‌ను ఓ దుండ‌గుడు ఛేదించాడు. త‌ల భాగాన్ని వేరు చేసి.. గ‌ర్భాల‌యం బ‌య‌ట పెట్టాడు. ఈ ఘ‌ట‌న తీవ్ర‌స్థాయిలో దేశ‌వ్యాప్తంగా అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. దీనిపై వైసీపీ ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశించింది. కానీ.. ఇత‌మిత్థంగా దీని బాధ్యులు ఎవ‌రనేది ఇప్ప‌టికీ తెలియ‌దు. ఓ మ‌ద్యం మ‌త్తులో ఉన్న వ్య‌క్తిని బాధ్యుడిని చేసినా.. దీనికి స‌రైన ఆధారాలు లేవంటూ అత‌నిని విడిచి పెట్టారు. ఈ ఘ‌ట‌నపై అప్ప‌ట్లో ఆల‌య అనువంశిక ధ‌ర్మ‌క‌ర్త పూస‌పాటి అశోక్‌గ‌జ‌ప‌తి రాజు నిర‌స‌న వ్య‌క్తం చేశారు.
 
కాగా.. ఆ త‌ర్వాత‌.. వైసీపీ ప్ర‌భుత్వానికి ప‌లువురు పండితులు కొన్ని సూచ‌న‌లు చేశారు. నూత‌న విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించాల‌ని.. శిర ఛ్చేద‌న‌కు గురైన విగ్ర‌హాన్ని ప‌విత్ర జ‌లాల్లో నిమ‌జ్జ‌నంచేసి శాంతి జ‌రిపించాల‌ని సూచించారు. కానీ.. వైసీపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. నూత‌న విగ్ర‌హ ప్ర‌తిష్ఠ చేసినా.. శిర‌ఛ్చేద‌న‌కు గురైన విగ్ర‌హాల తొల‌గింపు.. నిమ‌జ్జ‌నాన్ని అలానే వ‌దిలేసింది. దీనిపై తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. సుమారు 50 ల‌క్ష‌ల‌రూపాయ‌లు వెచ్చించి.. గ‌తంలో జ‌రిగిన అప‌చారానికి ఉప‌చారం చేయించింది.
 
నాడు దెబ్బ‌తిన్న విగ్ర‌హాల‌ను సోమ‌వారం ఊరేగింపుగా తీసుకువ‌చ్చిన ఆల‌య అధికారులు, పండితులు.. తూర్పుగోదావ‌రి జిల్లాలోని గోదావ‌రి న‌దిలో నిమ‌జ్జ‌నం చేశారు. దీనికి ముందు శాంతి హోమం నిర్వ‌హించారు. దీంతో అప‌విత్ర కార్య‌క్ర‌మం తాలూకు ప్ర‌భావం త‌గ్గుతుంద‌ని పండితులు తెలిపారు. కాగా.. నాడు న‌మోదైన కేసు విచార‌ణ ఇంకా కొన‌సాగుతోంద‌ని పోలీసులు చెప్ప‌డం గ‌మ‌నార్హం. 
Tags
Ycp TDP antarvedi temple chariot burnt issue ramateertham lord rama
Recent Comments
Leave a Comment

Related News