ఏపీ రాజధాని అమరావతి రెండో దశ పనులు కూడా వేగం పుంజుకోనున్నాయి. దీనికి సంబంధించి.. ఇటు ప్రభుత్వం-అటు రైతులు కూడా బెట్టు సడలించారు. రాజధాని నిర్మాణమే పరమావధిగా భావిస్తున్న ప్రభుత్వం.. రైతుల డిమాండ్లను దాదాపు అంగీకరించింది. ప్రధానంగా రైతులు రెండో దశలో వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేసేలా వ్యవహరించింది. దీంతో అమరావతి రెండో దశ భూ సమీకరణ వేగంగా ముందుకు సాగుతోంది.
ఇదీ.. తాజా అప్డేట్..
1) అమరావతికి చట్టబద్ధత: ఇప్పటికే పార్లమెంటు అమరావతికి చట్టబద్ధత కల్పించింది. రాష్ట్ర రాజధాని గా అమరావతి ఉంటుందని స్పష్టం చేసింది. దీనిని ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులకు వారికి అర్ధమ య్యేలా వివరించింది. దీంతో రైతులు ఖుషీ అవుతున్నారు.
2) కౌలు: రెండో దశ భూసమీకరణలో ఎకరానికి ప్రతి ఏటా 40 వేల రూపాయల చొప్పున కౌలు ఇవ్వనున్నా రు. దీనిని పదేళ్లపాటు కొనసాగిస్తారు. అంతేకాదు.. ఏటా 3000 చొప్పున పెంచుతారు. అంటే.. పదేళ్లకు.. దాదాపు ఒక్కొక్క ఎకరానికి.. 1.2 లక్షల రూపాయల వరకు కౌలు రానుంది.
3) రెండో దశ భూసమీకరణకు సహకరించే రైతులకు దాదాపు 1.5 లక్షల రూపాయల వరకు రుణ మాఫీని తక్షణం వర్తింప చేయనున్నారు. ఇది రైతులకు మరింత వెసులుబాటు కల్పించింది.
4) సెకండ్ ఫేజ్‌లో భూములు ఇచ్చే రైతులుకు కూడా తొలిదశలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారు. వీరికి కూడా కమర్షియల్ తో పాటు.. నివాసయోగ్యమైన భూములను ప్రభుత్వం అభివృద్ధి చేసి(అంటే.. రహదారులు, లైట్లు, తాగునీరు.. కమ్యూనిటీ హాళ్లు.. వంటివి) ఇవ్వనుంది. దీనికి రైతులు సంతోషం వ్యక్తం చేశారు.