టాలీవుడ్(Tollywood) వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించిన 'గాయపడ్డ సింహం' సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో, చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూల్లో సినిమా విశేషాల కంటే ఎక్కువగా యాంకర్ విష్ణుప్రియతో ఆయన పెళ్లి గురించి వస్తున్న వార్తలే వైరల్ అవుతున్నాయి.
గత కొంతకాలంగా జేడీ చక్రవర్తి(JD Chakravarthy), విష్ణుప్రియ వివాహం చేసుకోబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా జేడీ ఓపెన్ అయ్యారు. అసలు తమ మధ్య ఉన్న బంధం ఏంటో వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "విష్ణుప్రియకు నాకు మధ్య ఎఫైర్ ఉందనడం చాలా దుర్మార్గమైన విషయం. నాలో నటుడితో పాటు ఒక ఫిలాసఫర్ కూడా ఉన్నాడు. ఆ కోణంలో విష్ణుప్రియ నా శిష్యురాలు" అని జేడీ స్పష్టం చేశారు.
ఆమె తనను 'గురువుగారు' అని మాత్రమే సంబోధిస్తుందని, ఆమెకు ఏదైనా సందేహం వస్తే కేవలం ఫిలాసఫీ గురించే చర్చిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. విష్ణుప్రియ(Vishnupriya)లో అపారమైన దైవభక్తి, జ్ఞానం ఉన్నాయని మెచ్చుకుంటూనే.. ఆమె వ్యక్తిగత జీవితంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. తామిద్దరం కలిసి దాదాపు మూడేళ్లు అవుతోందని చెప్తూ, పెళ్లి వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
కాగా, ఒకానొక సెలబ్రిటీ గేమ్ షోలో విష్ణుప్రియ మాట్లాడుతూ.. తనకు జేడీ చక్రవర్తి అంటే చాలా ఇష్టమని, ఆయన ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు, జేడీ వాళ్ళ అమ్మగారిని సైతం ఒప్పిస్తానని చెప్పడంతో పెళ్లి పుకార్లు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి 'దయా' (Dayaa) అనే వెబ్ సిరీస్‌లో నటించడంతో పుకార్లకు మరింత బలం చేకూరింది. అయితే ఫైనల్‌గా జేడీ విష్ణుతో తన రిలేషన్ ఏంటో కుండబద్దలు కొట్టేశారు. దీంతో జేడీ చేసి కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశంగా మారాయి.