ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కొద్ది రోజుల క్రితం సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ తర్వాత పవన్ హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పవన్ ను సీఎం చంద్రబాబు కలిశారు. హైదరాబాదులోని పవన్ నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లారు.
పవన్ ను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, దేశ రాజకీయాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.