దస్ పల్లా హోటల్ హైదరాబాద్ అధినేత శరత్ జాస్తి, వసుధ దంపతుల 30వ వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వారి ఏకైక కుమారుడు రఘు, కూతురు హర్షిత, అల్లుడు లోకేష్ లు ఈ వేడుకలను నిర్వహించి వారికి సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ వేడుకలకు శరత్, వసుధల బంధువులు, స్నేహితులు, ఆప్తులు హాజరై వారిద్దరిని ఆశీర్వదించారు. ఈ జంట ఇటువంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు మరిన్ని జరుపుకోవాలని వారంతా ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శరత్, వసుధ దంపతులకు 'నమస్తే ఆంధ్ర' తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.









