ఒక ఎంజీఆర్.. ఒక ఎన్టీఆర్.. ఒక విజయ్

admin
Published by Admin — May 05, 2026 in National
News Image

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తొలిసారి రంగంలోకి దిగిన న‌టుడు విజ‌య్‌.. పార్టీ టీవీకే 108 స్థానాల్లో ఘన విజయం సాధించింది. టీవీకే కోరితే ముద్దతిచ్చేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రెడీగా ఉన్నాయి. దీంతో ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఈ నేపథ్యంలోనే ఆయ‌న కుటుంబం సంబ‌రాల్లో మునిగిపోయింది. పార్టీ గుర్త‌యిన విజిల్‌ను ఊదుతూ.. విజ‌య్ కుటుంబ స‌భ్యులు సంబ‌రాలు చేసుకున్నారు. 

అభిమానులు కూడా భారీ సం ఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా బాణా సంచా కాల్చి సంబ‌రాల్లో మునిగిపోయారు. పార్టీ పెట్టిన వెంట‌నే అధికారంలో కి వ‌చ్చిన జాబితాలో విజ‌య్(vijay) చేరారు. ఎప్పుడో 1970-80ల‌లో న‌టుడు ఎంజీఆర్‌(mgr).. ఏపీలో ఎన్టీఆర్‌(ntr)లు పార్టీ పెట్టిన తొలినాళ్ల‌లోనే విజ‌యం ద‌క్కిం చుకుని అధికార ప‌గ్గాలు చేప‌ట్టారు. ఆ త‌ర్వాత ఇరు రాష్ట్రాల్లోనూ అనేక మంది న‌టులు పార్టీలు పెట్టినా.. వారు ప్ర‌జ‌ల‌ను మెప్పించే ప్ర‌య‌త్నంలో వెనుక‌బ‌డ్డారు. అధికారానికి దూర‌మ‌య్యారు. కానీ.. త‌మిళ‌నాట తొలిసారి పార్టీ పెట్టిన విజ‌య్‌.. 229 స్థానాల్లోనూ త‌న పార్టీ అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టారు. ఈ ఎన్నిక‌ల్లో 108 సీట్ల‌లో విజ‌యం సాధించారు.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు.. రాష్ట్ర డీజీపీ.. విజ‌య్ నివాసం స‌హా.. పార్టీ కార్యాల‌యాల ముందు భారీ భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు. విజ‌య్ నివాసానికి దారి తీసే ర‌హ‌దారుల‌ను పోలీసు లు మూసి వేశారు. పార్టీ అధిష్టానంలోని పెద్ద‌ల నుంచి అనుమ‌తి ఉన్న‌వారినే అనుమ‌తిస్తున్నారు. ఇక‌, రాష్ట్రంలో మిఠాయిల పంపిణీతోపాటు.. బిర్యానీ పంప‌కాలు కూడా జ‌రుగుతున్నాయి. ఊహించ‌ని విజ‌యం ద‌క్కించుకున్న నాయ‌కులు సంబ‌రాల్లో మునిగిపోయాయి.

మ‌రోవైపు.. డీఎంకే పార్టీ అధికారంలోకివ‌స్తుంద‌న్న స‌ర్వేల‌న్నీ.. ప‌టాపంచ‌లు కావ‌డంతో ఆ పార్టీ శ్రేణులు నిర్వేదంలో మునిగిపోయాయి. ముంద‌స్తు సంబ‌రాల కోసం సిద్ధం చేసుకున్న స‌రంజామాను స‌ర్దేశాయి. పార్టీ అధినేత స్టాలిన్ సైతం మౌనంగా ఉండిపోయారు. సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. పార్టీ ఓట‌మికి కార‌ణాల‌ను అన్వేషిస్తామ‌ని స్టాలిన్ ప్ర‌క‌టించారు. 

Tags
Vijay ntr mgr record Tamilnadu election results
Recent Comments
Leave a Comment

Related News