కాలిఫోర్నియాలో A HUB GLOBAL యాదాద్రి హిల్స్ గ్రాండ్ ఇన్వెస్టర్ లాంచ్ విజయవంతం

admin
Published by Admin — May 05, 2026 in Nri
News Image

A HUB GLOBAL LLC తన ప్రధాన ప్రాజెక్ట్ ‘యాదాద్రి హిల్స్ – ఎయిర్‌పోర్ట్ ఆధారిత మాడ్యులర్ టౌన్‌షిప్’ కోసం గ్రాండ్ ఇన్వెస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని బే ఏరియాలో విజయవంతంగా నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు బే ఏరియా నుంచి పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, కమ్యూనిటీ నాయకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం A HUB GLOBAL విజన్‌పై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని మరింత బలపరిచింది.

ఈ ఈవెంట్‌లో చర్చలు, భాగస్వామ్యం కోసం పెట్టుబడి దారులు ఆసక్తి కనబరిచారు. ‘యాదాద్రి హిల్స్’ తూర్పు హైదరాబాద్ ట్రయాంగిల్ కారిడార్‌లో ఎయిరోట్రోపోలిస్ (విమానాశ్రయం ఆధారిత) సమగ్ర టౌన్‌షిప్‌గా అభివృద్ధి చేయనుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు వ్యాపార దిగ్గజం ఐలేని జయరాం రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం 500 ఎకరాల భూమిని అందజేస్తూ, 2025 అక్టోబర్‌లో A HUB GLOBAL స్థాపకుడు, అధ్యక్షుడు శ్రీనివాస మణప్రగడతో ఒప్పందం (MOU) కుదుర్చుకున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో పెట్టే ప్రతి పెట్టుబడి బలమైన పునాది మీద నిలబడుతుంది మరియు మంచి లాభాలను అందిస్తుందని ఐలేని జయరాం రెడ్డి అన్నారు. తూర్పు హైదరాబాద్ ట్రయాంగిల్ కారిడార్‌ను అభివృద్ధి కేంద్రంగా మార్చాలనే A HUB GLOBAL విజన్‌కు తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను తెలంగాణలోనే మొదటిసారి ఏర్పడుతున్న భారీ ఎయిరోట్రోపోలిస్ ప్రేరణతో కూడిన సమగ్ర టౌన్‌షిప్‌ అని ఆయన అభివర్ణించారు. 

ఈస్ట్ బేలో A HUB EVENT CENTER ఈస్ట్ బే ప్రాంతంలో (సాన్ రామోన్ & డబ్లిన్) ఏర్పాటు చేయనున్న A HUB EVENT CENTER పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిని ప్రీమియం కమ్యూనిటీ ఈవెంట్ మరియు సెలబ్రేషన్ వేదికగా, టెక్నాలజీ ఆధారిత అనుభవ కేంద్రంగా, సెమినార్లు, ఆవిష్కరణలు మరియు భవిష్యత్ తరాల అభివృద్ధికి వేదికగా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

“ఈ బిజీ వీకెండ్‌లో కూడా ఇంతటి స్పందన రావడం ఎంతో ప్రోత్సాహకరం. ‘Building Wealth Together’ అనే విజన్ ప్రజలలో బలంగా ప్రతిధ్వనిస్తోంది. యాదాద్రి హిల్స్ మరియు A HUB EVENT CENTER వంటి ప్రాజెక్టులు శ్రీనివాస మణప్రగడ ఆలోచనల ఫలితాలు. ఇవి పెట్టుబడిదారులకు మంచి లాభాలు తీసుకొస్తాయని నమ్ముతున్నాను” అని A HUB GLOBAL సలహాదారు రమేష్ తంగెళ్లపల్లి అన్నారు. 

ఎంతోమంది వ్యాపారవేత్తలకు గొప్ప ఆలోచనలు ఉంటాయని, కానీ సరైన వ్యక్తులు, భాగస్వాములు లేకపోతే అవి విజయవంతం కావని A HUB GLOBAL స్థాపకుడు శ్రీనివాస మణప్రగడ అన్నారు. A HUB GLOBALలో తాము ప్రాజెక్టులను మాత్రమే కాకుండా ,కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థను నిర్మిస్తున్నామని అన్నారు. 

“నేను 25 సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్నాను. ఇప్పుడు నా లక్ష్యం అమెరికా మరియు భారతదేశానికి తిరిగి సేవ చేయడం — అవకాశాలను సృష్టించడం, కమ్యూనిటీలను శక్తివంతం చేయడం మరియు గ్లోబల్ భాగస్వామ్యానికి వేదికను ఏర్పరచడం” అని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరైన పెట్టుబడిదారులు, ఐటీ రంగ నిపుణులు, హాస్పిటాలిటీ, నిర్మాణ రంగ ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులందరికీ శ్రీనివాస మణప్రగడ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది అని పెట్టుబడిదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
A HUB GLOBAL Yadadri hills grand investor launch successful california
Recent Comments
Leave a Comment

Related News