బే ఏరియాలో ఘనంగా 'పాఠశాల' 13వ 'వసంతోత్సవం'

admin
Published by Admin — May 05, 2026 in Nri
News Image

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) మరియు బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) సంయుక్తంగా పాఠశాల(patasala) 13వ వార్షిక దినోత్సవ వేడుకలు 'వసంతోత్సవం'ను ఘనంగా నిర్వహించాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు 500కి పైగా అతిథులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 6 గంటల పాటు నడిచిన ఈ కార్యక్రమం పాటలు, కవితలు, స్కిట్లు మరియు ప్రసంగాలతో అతిథులందరినీ ఆకట్టుకుంది. ఆడిటోరియన్ని రంగురంగుల బ్యానర్లు, కళాఖండాలు మరియు పువ్వులతో అందంగా అలంకరించారు.

అతిథులు మరియు నిర్వాహకులంతా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా వస్త్రాలు ధరించి ఆకట్టుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా టిడిపి యువ నేత, విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి భరత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నార్త్ అమెరికా స్పెషల్ రిప్రజెంటేటివ్ జయరాం కోమటి హాజరయ్యారు. పాఠశాల బృందాన్ని వారు అభినందించారు.

విదేశాల్లోని తెలుగు పిల్లలకు భాష మరియు సంస్కృతి నేర్పించడంలో పాఠశాల చేస్తున్న కృషిని ప్రశంసించారు. పిల్లలు పాల్గొన్న కార్యక్రమాలు చూసి ఆనందం వ్యక్తం చేశారు. గుణపాఠం (స్కిట్), పరమానందయ్య గారి శిష్యులు (నాటిక), శివసంకల్పం (నాటిక), శ్లోకాలు / పద్యాలు / గేయాలు అతిధులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి గ్రాడ్యుయేషన్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ కేంద్రాల నుంచి వచ్చిన విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వేదికపైకి వచ్చి సర్టిఫికెట్లు అందుకున్నారు.

సుధీర్ వున్నం (TANA రీజినల్ రిప్రజెంటేటివ్ - నార్తర్న్ కాలిఫోర్నియా), భాను మగులూరి (పాఠశాల చైర్), ప్రసాద్ మంగిన (పాఠశాల కో-చైర్), శివ కడ (BATA అధ్యక్షులు), విజయ ఆసూరి (అడ్వైజర్), డా. రమేష్ కొండ (అడ్వైజర్), డా. గీతా మాధవి (కరిక్యులం డైరెక్టర్)లు మాట్లాడుతూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు కోఆర్డినేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బే ఏరియాలో ప్రస్తుతం 250కి పైగా విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. 

ఎన్ఆర్ఐ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాఠ్యాంశాలు సులభంగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయని, తదుపరి తరాలకు తెలుగు భాష & సంస్కృతి అందించడమే పాఠశాల ముఖ్య లక్ష్యమని చెప్పారు.

BATA నాయకత్వం

అధ్యక్షులు: శివ కడ

వైస్ ప్రెసిడెంట్: వరుణ్

ఎగ్జిక్యూటివ్ కమిటీ: హరి ఎస్., సుందీప్ కె., సంకేత్

స్టీరింగ్ కమిటీ: రవి తిరువీధుల, కామేష్ మల్ల, యశ్వంత్ కుదరవల్లి, సుమంత్ పుసులూరి

కల్చరల్ డైరెక్టర్లు: శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, సిరీష బత్తుల, తారక దీప్తి

నామినేటెడ్ కమిటీ: సురేష్ శివపురం, రవి పోచిరాజు, హరీష్ ఇనంపూడి, సుధాకర్ బైరి

యూత్ కమిటీ: గౌతమి & సింధు

అడ్వైజరీ బోర్డు: జయరాం కోమటి, విజయ ఆసూరి, వీరు వుప్పల, ప్రసాద్ మంగిన, కరుణ్ వెలిగేటి, రమేష్ కొండ, కల్యాణ్ కట్టమూరి, హరినాథ్ చిక్కోటి

బే ఏరియా పాఠశాల కోఆర్డినేటర్లు: శ్రీదేవి యర్నేని, సురేష్ శివపురం, శ్రీదేవి పసుపులేటి, రామదాసు పులి, రవి పోచిరాజు, సునీత రాయపనేని

ఉపాధ్యాయులు: శ్రీకాంత్ దశరథి, శీల గోగినేని, సరత్ పొలవరపు, దీప్తి మండలి, రాగిణి అరసాడ, పద్మ సొంఠి, శ్రీదివ్య యలమంచి, శ్యామ్ బాలే, శ్రీనివాస్ కొల్లి, విలేఖ్య వెనిగళ్లల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రముఖ వేదిక కళాకారులు శ్రీ అక్కిరాజు రామకృష్ణ గారు కూడా హాజరై అందరు పిల్లలను ఆశీర్వదించారు. 

పాఠశాల కోఆర్డినేటర్లు వేదిక వద్ద ఉండి, వచ్చిన విద్యార్థులు మరియు తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రిజిస్ట్రేషన్ బూత్ మరియు ఈ-లెర్నింగ్ పై ప్రత్యేక డెమో కూడా ఏర్పాటు చేశారు. 'భీమవరం రుచులు' అందరికీ రుచికరమైన విందు భోజనం అందించింది.

News Image
News Image
News Image
News Image
News Image
News Image
News Image
Tags
Bay area patasala vasantotsavam grand style TDP mp Bharat jayaram komati ap government special representative of North America
Recent Comments
Leave a Comment

Related News