విజయ్ విక్టరీపై వర్మ మార్క్ కామెంట్స్..వైరల్

admin
Published by Admin — May 05, 2026 in National
News Image

తమిళనాడు రాజకీయాలతోపాటు దేశవ్యాప్తంగా టీవీకే(tvk) పేరు మార్మోగుతోన్న సంగతి తెలిసిందే. తమిళనాట ఎంజీఆర్ తర్వాత ఆ రేంజ్ లో ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్(vijay) పై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. 62 ఏళ్లుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ దిగ్గజ పార్టీలు డీఎంకే (DMK), ఏఐడీఎంకే (AIADMK)లను మట్టి కరిపించిన టీవీకే జర్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే విజయ్ విక్టరీపై విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితో విజయ్ కలిసి దిగిన పాత ఫోటోను ఆర్జీవీ షేర్ చేస్తూ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఓ ఈవెంట్ లో రిబ్బన్ కట్ చేస్తున్న కరుణానిధి వెనుక ఒక సాధారణ యువకుడిలా విజయ్ వినయంగా నిలుచున్న ఫొటోను వర్మ షేర్ చేశారు.

‘తన వెనుక నిలబడిన ఆ పిల్లాడు, ఒకరోజు తన పార్టీనే తుడిచిపెట్టేస్తాడని కలైంజర్ (కరుణానిధి karunanidhi) కలలో కూడా ఊహించి ఉండరు' అంటూ వర్మ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. నిజమే, కరుణానిధి మాత్రమే కాదు.. ఆయన తనయుడు స్టాలిన్, మనవడు ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్ ఈ రేంజ్ లో డీఎంకేను దెబ్బకొడతారని ఊహించి ఉండరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags
Tvk vijay's victory director varma's comments mgr dmk
Recent Comments
Leave a Comment

Related News