హిందూ వ్యతిరేకి జగన్ రెడ్డి పాలనలో భారతదేశ చరిత్రలో ఎక్కడా ఎన్నడూ దేవాలయాలపై జరగనన్ని దాడులు గత ప్రభుత్వ హయాంలో జరిగాయని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్ దుయ్యబట్టారు. హిందూ దేవుళ్లను కించపరిస్తే ఏ రోజు చర్యలు తీసుకోలేదు జగన్ రెడ్డి అని మండిపడ్డారు. వైసీపీ హయాంలో సర్వమత సమానత్వం అనేది పూర్తిగా కనుమరుగైందని అన్నారు.. అన్ని మతాలను గౌరవించాలనే కనీస రాజధర్మాన్ని విస్మరించి, నాటి జగన్ ప్రభుత్వం పక్షపాత వైఖరితో హిందూధర్మాన్ని అణచివేస్తూ, సనాతన సంప్రదాయాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆరోపించారు.
రామతీర్థంలోని ఆలయంలో రాములవారి శిరస్సు ఖండన చేయడం వంటి దాష్టీకానికి ఒడిగట్టారని, ఇలా ఒకటికాదు,రెండు కాదని, వందలాది దాడులు హిందూదేవాలయాలపై జగన్ పాలనలో పదేపదే ప్రతిరోజు జరుగుతుండేవని ఆరోపణలు చేశారు. దోషులను శిక్షించకుండా హిందువులకు మనోధైర్యం ఇవ్వకుండా, ఈ ఘటనలు ఖండిస్తున్నామని కూడా చెప్పకుండా ఐదేళ్లు జగన్ రెడ్డి హిందూ వ్యతిరేక విధానాలు కొనసాగించాడని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దేవాలయాలు పగలకొట్టారు, రథాలు తగులబెట్టారు, గుడిలో సొమ్ము
మాయం చేశారు, అన్యమతస్తులకు ప్రాధాన్యత ఇచ్చి హిందూమతంతో ఆడుకున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో 290 కు పైగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు జరిగాయని మండిపడ్డారు.
మరోవైపు, దేవాలయాలు, ప్రార్ధనా మందిరాల పరిరక్షణ కోసం టీడీపీ ఎనలేని కృషి చేసిందని బుచ్చి రాం ప్రసాద్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను కాపాడటంలో టీడీపీ ఎప్పుడూ రాజీ పడలేదని తెలిపారు. మతపరమైన ఉద్రిక్తతలకు తావు లేకుండా ఉక్కుపాదంతో అల్లర్లను అణిచివేసి, అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా తమ పండుగలను జరుపుకునే భద్రతా వలయాన్ని టీడీపీ ప్రభుత్వం కల్పించిందని చెప్పారు.
పవిత్ర క్షేత్రాల అభివృద్ధిలో ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఎనలేనిదని అన్నారు. టీడీపీ హయాంలో ప్రతి జిల్లాలోని ప్రముఖ దేవాలయాలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడమే కాకుండా గ్రామీణ దేవాలయాల అభివృద్ధికి కూడా నిధులు అందించారని గుర్తు చేశారు. ఆలయాల భద్రతను బలోపేతం చేయడానికి రక్షణ గార్డుల నియామకం, సీసీ కెమెరాలు, సెక్యూరిటీ మానిటరింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుదని కొనియాడారు.
అంతేకాకుండా, చారిత్రక క్షేత్రాల పునరుద్ధరణకు ప్రాధాన్యతనిచ్చి భక్తులకు సౌకర్యవంతమైన అనుభూతిని కల్పించేందుకు మౌలిక వసతులను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. తిరుపతి వంటి అంతర్జాతీయ స్థాయి ధార్మిక క్షేత్రాలను అభివృద్ధి చేయడంలో చంద్రబాబు విశేష కృషి చేశారని ప్రశంసించారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులభతరం చేశారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని అన్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి ఆలయాల అభివృద్ధికి మౌలిక వసతులను మెరుగుపరిచారని చెప్పారు. ఆలయ భూముల పరిరక్షణ కోసం అక్రమ కబ్జాల తొలగింపుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారని అన్నారు.
కూటమి పాలనలో ఆలయ పరిరక్షణకు చొరవ తీసుకున్నారని చెప్పారు.ఆలయాల్లో అన్యమత ఉద్యోగుల నియామకాలపై చర్యలు చేపట్టి, ఆలయ పవిత్రతను కూటమి ప్రభుత్వం కాపాడుతోందన్నారు. ఆలయాల ధ్వంసం వంటి ఘటనలపై విచారణ జరిపి, నిందితులపై కఠిన శిక్షలు విధించేందుకు చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్నారు.
పాలకవర్గాల్లో నాయీ బ్రాహ్మణులకు అవకాశం కల్పిస్తూ, కొత్తగా ఒక బ్రాహ్మణ సభ్యుడిని చేర్చే చర్యలు
చేపట్టింది. బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలను బలోపేతం చేయడానికి కొత్త
పాలకవర్గాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందని తెలిపారు.
ఆలయాల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు:
‘‘రూ.50,000 లోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాల కోసం రూ.5,000
నుంచి రూ.10,000 సాయం, రూ.50,000 పైబడి ఆదాయం ఉన్న ఆలయాలకు రూ.10,000
నుంచి రూ.15,000 సాయం అందజేస్తోంది. అర్చకులకు రూ.15,000 కనీస వేతనం, నాయీ బ్రాహ్మణులకు రూ.25,000 కనీస వేతనం అందిస్తోంది. నిరుద్యోగ వేద విద్యార్థులకు నెలకు రూ.3,000 భృతి అందిస్తోంది. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి
ఆత్మార్పణ రోజున దేవాదాయ శాఖ అధికారిక కార్యక్రమం నిర్వహిస్తోంది.
తిరుపతి, ఒంటిమిట్ట ఆలయాల్లో వెయ్యి కాల మండప పునరుద్ధరణకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది.
గత ప్రభుత్వంలో ఆలయాలు, పూజారులపై జరిగిన దాడులపై విచారణకు ప్రత్యేక కమిషన్
నియమించింది. పురోహితులు, వంట బ్రాహ్మణులను కుల వృత్తిగా గుర్తించేందుకు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా చర్యలు
తీసుకుంది. సింహాచలం పంచగ్రామాల భూసమస్యకు శాశ్వత పరిష్కారం చేసింది.
ఆలయాల్లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిపూర్ణంగా నెలకొల్పేందుకు, ధార్మిక సంప్రదాయాలను
సంరక్షించేందుకు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం అనేక చర్యలు
చేపడుతోంది, భక్తుల విశ్వాసాన్ని బలోపేతం చేస్తోంది.
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడులు
1 విగ్రహాల ధ్వంసం, కూల్చివేత - 103
2 భక్తుల మనోభావాలు దెబ్బతీసే చర్యలు, అన్యమత ప్రచారాలు - 87
3 దేవాలయ ఆస్తులు, ఆదాయాల్లో అక్రమాలు - 43
4 దేవాలయాల భూముల్లో అక్రమాలు - 40
5 అర్చకులకు వేధింపులు - 10
6 గోశాలల్లో గోవుల మృతి ఘటనలు - 3
మొత్తం 286
వైసీపీ పాలనలో తిరుమల దోపిడీ
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఈ పుణ్యభూమిని
కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే భక్తులు శ్రీనివాసుడిని భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటారు.
అయితే, గత వైసీపీ ప్రభుత్వం ఈ పవిత్ర క్షేత్రాన్ని రాజకీయ కేంద్రంగా, దోపిడీకి ఏటీఎంగా మార్చింది.
అవినీతి, అక్రమాలకు పాల్పడి ఆలయ పవిత్రతను దెబ్బతీసింది. అవినీతి, అక్రమాల్లో నాకేది అతీతం కాదు
అన్నట్లు ఐదేళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్నది చాలకా తిరుమలను కూడా గత పాలకులు దోచుకొని తిరుమల
ప్రతిష్టతను దెబ్బతీశారు..
అక్రమ నియామకాలు, అవినీతి
సామాజిక న్యాయమంటూ ఒకే సామాజిక వర్గానికి పాలకమండలిలో ఎక్కువ శాతం జగన్ రెడ్డి
కట్టబెట్టాడు. ఎటువంటి అర్హత లేని ధర్మారెడ్డిని (non-IAS) ఒకసారి టీటీడీ జేఈఓగా నియమించి
తర్వాత ఏకంగా ఈఓగా నియమించి తమ దోపిడీకి అడ్డులేకుండా చేశారు.
లేని పింక్ డైమెండ్ ను దొంగిలించారంటూ టీటీడీ ప్రతిష్టకే మచ్చ తెచ్చేలా వ్యవహరించారు.
సనాతన ధర్మానికి ఆయువుపట్టుగా నిలిచిన టీటీడీని ఏటీఎంగా మార్చి వైసీపీ నేతలు అనేక అక్రమాలకు
పాల్పడ్డారు.
తిరుపతి కొండ మీద ఉన్నది దేవుడు కాదు నల్లరాయి అని చెప్పిన నాస్తికుడైన భూమన కరుణాకర్ రెడ్డిని
టీటీడీ ఛైర్మన్ గా నియమించి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని అస్తవ్యస్తం చేశాడు.
ఏడు కొండలను మూడు కొండలకే పరిమితం చేసే కుట్ర, భక్తులకు స్వామివారిని దూరం చేసే
ప్రయత్నాలు జరిగింది జగన్ హయాంలోనే.
ఆలయ సంప్రదాయాల ఉల్లంఘన
సతీసమేతంగా ఐదేళ్లలో ఒకసారి కూడా బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించని ఏకైక
వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.
కోట్లాది భక్తులు గౌరవంతో సేవించే శ్రీవారి ప్రసాదాన్ని పక్కన పెట్టడం, అక్షింతలను దులిపేసుకోవడంతో
జగన్మోహన్ రెడ్డికి స్వామివారి పట్ల భక్తి లేదన్నది స్పష్టమైంది..
శ్రీవారి సొమ్ము దోపిడీ
1. వైసీపీ పాలన హయాంలో టీటీడీలో మహా పాపానికి పాల్పడింది జగన్ ముఠా. ఏకంగా శ్రీవారి
పరకామణి నుంచి వందల కోట్లు దోచేసినా కనీసం కేసు లేదు.
2. టీటీడీలో అన్యమతస్థుల ఉద్యోగుల నియామకం, బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం, కొండపై అన్యమత
గుర్తులు, అధికారిక వెబ్ సైట్లో అన్యమత బోధనలు, భక్తుడికి అశ్లీల వెబ్ సైట్ లింక్ పంపడం, దర్శనం,
వసతి, అద్దె, టోల్, ప్రసాదాల ధరలు పెంచడం, గదుల్లో వైసీపీ పార్టీ ప్రచార స్టికర్లు అంటించడం ఇలా
ఒకటేంటి చేయకూడనన్ని పాపాలను గత పాలకులు చేశారు.
3. టీటీడీ ఆస్తులను రాజకీయ అవసరాలకు గత ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు.
4. ఎన్నికల ప్రచారాల్లో కరపత్రంలా లక్షల లడ్డూలను వైసీపీ నాయకులు పంచారు. టీటీడీ నిధులను దారి
మళ్ళించి తిరుపతి నగరపాలక సంస్థ పేరిట కోట్ల రూపాయిలు దోచుకున్నారు.
5. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కలిసి వీఐపీ బ్రేక్, సేవా టిక్కెట్లు అమ్ముకున్నారు..సేవా టిక్కెట్లు,
దర్శన టిక్కెట్లు, ప్రసాదాలు అన్నింటిలోనూ బ్లాక్ మార్కెట్ నడిపి కోట్లు దండుకున్నారు.
6. వెంకన్నకిచ్చే తలనీలాలను సైతం వైసీపీ దోపిడీకి అతీతం కాలేదనే చెప్పాలి. రూ.2 కోట్ల విలువైన
తలనీలాలను అక్రమంగా చైనాకు తరలిస్తుండగా అస్సాం రైఫిల్స్ పట్టుకున్న ఘటన వైసీపీ దౌర్భాగ్య
పాలనకు నిదర్శనం.
7. నిబంధనలు తుంగలో తొక్కి శారద పీఠానికి అడ్డగోలుగా భూకేటాయింపులు ఇచ్చారు. అక్రమంగా
నిర్మాణాలు చేపట్టారు.
తీర్మానం: “మత సామరస్యమే నవ్యాంధ్ర ప్రగతికి నిదర్శనం”
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో సరికొత్త మత సామరస్యం
వెల్లివిరుస్తోంది. పురాతన ఆలయాల ధూపదీప నైవేద్యాల నుండి, చర్చిల నిర్మాణం, మసీదుల
ఇమామ్‌లకు గౌరవ వేతనాల వరకు అన్ని వర్గాల ఆధ్యాత్మిక అవసరాలకు సహాయం అందిస్తూ మా
ప్రభుత్వం మత సామరస్యానికి నిజమైన ప్రతీకగా నిలుస్తోంది. మతపరమైన గౌరవం, రక్షణ కల్పించడమే
కాకుండా, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు, సబ్సిడీ
రుణాలు అందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంలో టీడీపీ ప్రభుత్వం క్రియాశీలక పాత్ర
పోషిస్తోంది.
రాష్ట్రంలోని ఏ ఒక్క దేవాలయం లేదా ప్రార్థనా మందిరంపై కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు
జరగకుండా , సీసీటివి నిఘా, కట్టుదిట్టమైన భద్రతతో పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడటంలో ప్రభుత్వం
100% విజయం సాధించాము. ప్రతి పౌరుడు తన మతపరమైన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే,
దేశాభివృద్ధిలో భాగస్వామి అయ్యేలా ప్రోత్సహించడమే మా ప్రధాన లక్ష్యం. గౌరవనీయులైన నారా
చంద్రబాబు నాయుడు గారి అంకితభావంతో కూడిన ఈ సమగ్ర దృక్పథమే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అసలైన మూలస్తంభం అని విశ్వసిస్తూ, ఇదే మార్గంలో నిరంతరం ముందుకు సాగుతాం.