చంద్రబాబు ముందుచూపు..హ్యాట్సాఫ్

admin
Published by Admin — May 19, 2026 in Andhra
News Image
చైనా వంటి దేశాలలో యువత తగ్గిపోవడంతో అక్కడి ప్రభుత్వాలు ఎక్కువ మంది పిల్లలు కంటే ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ఒకప్పుడు ఒక్కరు ముద్దు అంటూ జనాభా నియంత్రణపై కఠినంగా వ్యవహరించిన చైనా వంటి ప్రభుత్వాలు ఇప్పుడు పిల్లల కంటే బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ లో కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ పై ఏపీ సీఎం చంద్రబాబు చాలా నెలల నుంచి ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. 
 
ఆ నేపథ్యంలోనే మూడో బిడ్డను కంటే 30 వేలు, నాలుగో బిడ్డను కంటే 40 వేలు ప్రోత్సాహకాలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అయితే, చంద్రబాబు చెప్పిన విషయంపై కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. కానీ, చంద్రబాబు ముందుచూపును వారు గుర్తించలేకపోతున్నారు. విజనరీ లీడర్ గా పేరున్న చంద్రబాబు భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గడం వల్ల వచ్చే ఇబ్బందులను ముందుగానే గుర్తించారు. అందుకే, చేతులు కాలాక ఆకులు పట్టుకోకుండా ముందుగానే ప్రజలను చైతన్యపరుస్తున్నారు.
Tags
cm chandrababu population management vison
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News