ఏపీ సీఎం చంద్రబాబు శనివారం చిత్తూరు జిల్లాలో పర్యటించారు. యాదమరి మండలంలోని 'సంజీవని' ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న డిజిటల్ వైద్య సేవలను సమీక్షించారు. టెక్నాలజీని సమర్థవంతంగా అనుసంధానం చేసి సామాన్య ప్రజలకు ఎలాంటి వైద్యం అందుతోందని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా, ఒక రోగి పీహెచ్‌సీకి వచ్చినప్పటి నుంచి వైద్య పరీక్షలు చేయించుకుని, మందులు తీసుకొని వెళ్లే వరకు మొత్తం ప్రక్రియను ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా వీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వైద్య సేవలు అందించే విధానాన్ని స్వయంగా పరిశీలించారు.
గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల మధ్య వైద్య అంతరాలను తగ్గించడంలో ఆధునిక టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.