బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి.. రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్(Bandi Bhagirath) మళ్లీ జైలుకు వెళ్లా రు. అయితే.. ఆయనను విచారించేందుకు.. పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఉన్నతాధికారులు బండి భగీరథ్‌ను విచారించారు. ఈ విచారణ గడువు శుక్రవారంతో ముగిసింది. దీంతో మరోసారి వైద్య పరీక్షలు చేయించిన అనంతరం.. భగీరథ్‌ను కోర్టుకు తరలించారు.
కోర్టు ఆదేశాలతో చర్లపల్లి జైలు(Cherlapally Jail)కు తరలించనున్నారు. కాగా.. ఈ మూడు రోజుల విచారణలో బాధితురాలు.. డీసీపీకి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పలు ప్రశ్నలు సంధించారు. అయితే.. ఈ విషయంలో తాను తప్పు చేశానని కానీ.. ప్రమేయం లేదని కానీ.. భగీరథ్ చెప్పినట్టు తెలియరాలేదు. ఏ విషయం ప్రశ్నించి నా.. తన ప్రమేయం లేదని.. చెప్పినట్టు తెలిసింది. ఇక, వాట్సాప్ సహా.. ఇన్‌స్టా వంటి వాటిని కూడా చూపించి.. ప్రశ్నించారు.
ముఖ్యంగా బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలంలోని అనేక అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే.. ప్రతి విషయాన్నీ.. తనకు తెలియదని చెప్పినట్టు సమాచారం. మొత్తంగా మూడు రోజుల విచారణలో భగీరథ్‌ను 13 గంటలపాటు ప్రశ్నించారు. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన నేపథ్యాని కి తోడు.. పోక్సో కేసుకావడంతో విచారణను రికార్డు చేశారు. ఆయన తరపు న్యాయవాదిని కూడా అనుమ తించారు. ఇదిలావుంటే, హైకోర్టు(High Court)లో బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.