మన దేశం కర్మభూమి, వేద భూమి, ప్రపంచంలో సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టే కొన్ని దేశాల జాబితాలో ముందు వరుసలో నిలిచిన దేశంగా కూడా గుర్తింపు పొందింది. అయితే.. ఇక నుంచి ఇవి పుస్తకాలకే పరిమితం అవుతారా? సమాజంలో కనిపించవా? అనే విషయాలపై ఆసక్తికర చర్చ ప్రారంభ మైంది. స్వేచ్ఛ, సమానత్వం అనేవి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులే అయినా.. వీటి ముసుగులో దేశ జీవనాడిపై జరుగుతున్న దాడి మరో చిత్రమైన పరిణామంగా మారుతోందని పలువురు వాపోతున్నారు.
అయితే.. ఎవరూ ఎవరినీ తప్పుపట్టడం లేదు. కానీ.. జరుగుతున్న పరిణామాలపైనే ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఈ పరిణామాలను.. న్యాయవ్యవస్థ సమర్థించడం కొసమెరుపు. గత కొన్నాళ్లుగా.. దేశ సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పులు.. సమాజంలో చర్చకు దారితీస్తున్నాయి. అలాగని న్యాయవ్యవస్థను ఎవరూ తప్పుబట్ట డం లేదు. కానీ.. ఆలోచన చేయాలని సూచిస్తున్నారు. `ఇలాంటి` అంశాల్లో హద్దులు అదుపులు లేకపోతే.. భారత దేశ కీర్తి పతాకకు మసి రాజుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఏంటవి?
1) సహజీవనం: పెళ్లయి.. పిల్లలు, భార్య/ భర్త.. జీవించి ఉండగానే వేరే వారితో సహజీవనం చేయడం తప్పుకాదని కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. పరస్పర అంగీకారంతో చేసే సహజీవనాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. చిత్రం ఏంటంటే.. ఈ తీర్పు సహజీవనం చేసేవారికి రెడ్ కార్పెట్‌గా మారిపోయింది. అనంతరం.. దేశవ్యాప్తంగా కుటుంబ కేసుల సంఖ్య పెరిగిపోయింది.
2) `గే` తప్పుకాదు: పరస్పర అంగీకారంతో స్వలింగ సంపర్కులు కలిసి జీవించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నిజానికి భారతీయ సమాజం దీనిని అంగీకరించదు. పురుషుడు-పురుషుడు, మహిళ-మహిళ ఇద్దరూ కలిసి జీవించే పరిస్థితి కూడా ఉండదు. కానీ.. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వాదన బలపడింది. దేశంలో ఇప్పుడు `గే` కుటుంబాల సంఖ్య 2 శాతానికి చేరిపోయిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
3) వేశ్యావృత్తి నేరం కాదు: అనాదిగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ వృత్తిని దుబాయ్, అమెరికా సహా.. అనేక వర్ధమాన దేశాలు నిషేధించాయి. భారత దేశంలోనూ దీనిపై నిషేధం ఉంది. నేరజాబితాలోనూ వేశ్యావృత్తి ని పేర్కొన్నారు. కానీ, తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వేశ్యావృత్తి నేరం కాదని.. పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టడానికి, మహిళలను(ఆ వృత్తిలో ఉన్న) వేధించడానికి వీలులేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. మహిళ తనకు ఇష్టమై.. ఈ వృత్తిని చేపట్టానని చెబితే.. కేసు కూడా నమోదు చేయొద్దని చెప్పేసింది. ఇలా ఈ తీర్పు వస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ.. సుప్రీంకోర్టు రెడ్ కార్పెట్ పరిచింది.
ఏం జరుగుతుంది?
+ వాస్తవానికి ఇప్పటికే.. 8 ఏళ్లు నిండిన పిల్లలను కొట్టడానికి తిట్టడానికి కూడా తల్లిదండ్రులకు హక్కులేదని అలహాబాద్ కోర్టు ఇచ్చిన మూడు దశాబ్దాల కిందటి తీర్పుతో పిల్లలు ఏం చేసినా.. అడిగే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా పిల్లలు దారి తప్పుతున్నారని.. ఇటీవల జాతీయ నేరగణాంకాల జాబితా(ఎన్ సీ ఆర్) స్పష్టం చేసింది. తల్లిదండ్రుల మాట వినిపించుకోవడం లేదని కూడా చెప్పింది.
+ భార్య/ భర్తల ఫోన్లు వారి గోప్యతా హక్కుకిందకు వస్తాయని కొన్నాళ్ల కిందట సుప్రీంకోర్టు సమర్థించింది. ఫలితంగా.. ఇప్పుడు ఫోన్లలో ఏం జరుగుతోందో కూడా తెలియని పరిస్థితి చక్కదిద్దుకోలేని విధంగా చేతులు దాటుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
+ మహిళల కోసం తీసుకువచ్చిన 498 చట్టం..(గృహ హింస చట్టం) దేశవ్యాప్తంగా తీవ్ర వివాదానికి దారితీసింది. తాజాగా గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ భర్త.. తన భార్య నుంచి తనను తాను కాపాడుకునేందుకు మరణమే శరణ్యమని పేర్కొంటూ.వాలంటరీ మరణానికిఅనుమతించాలని వేడుకున్నాడు.