ఒమాన్ లో ఘనంగా మహానాడు వేడుకలు

admin
Published by Admin — May 30, 2026 in Nri
News Image

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడు కార్యక్రమానికి సంబంధించి ఎన్ఆర్ఐ టిడిపి ఒమాన్ ఆధ్వర్యంలో ఘనంగా మహానాడు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ టిడిపి ఒమాన్ ప్రధాన కార్యదర్శి వంకా రమణమ్మ గారు నాయకత్వం వహించారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి తెలుగు తమ్ముడు, ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

“తెలుగుదేశం పార్టీ అనేది తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదు… కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం. విదేశాల్లో ఉన్నా పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్త సేవలు అమూల్యం” అని వంకా రమణమ్మ పేర్కొన్నారు.

అలాగే ఎన్టీఆర్ ఆశయాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి దృక్పథాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని ఆమె అన్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు ప్రజలు పార్టీకి ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారని తెలిపారు.

ఈ ప్రెస్ మీట్‌లో నాగలక్ష్మి, అరుణ, మహాలక్ష్మి, జగదీశ్వరి, దుర్గ, నయోమి, నాగమణి, రమణ, పద్మ, నేహ, అనిత, కృష్ణవేణి, రూతు, దొంగ శ్రీనివాస్, దొమ్మేటి ఏసు బాబు, జోగి శ్రీను, చెల్లబోయిన దుర్గాప్రసాద్, డి శ్రీనివాస్, పెంచేటి సత్యనారాయణ, ఇలుకు మోసరాజ్, శీలం రాంబాబు, ఉల్లింగి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.

“ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగుదేశం పార్టీపై అభిమానాన్ని తగ్గించలేరు. ఎన్ఆర్ఐ టిడిపి ఒమాన్ బృందం పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తూ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉంది” అని తెలిపారు.

కార్యక్రమంలో పార్టీ జెండాలు, నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని మహానాడు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

News Image
News Image
Tags
TDP mahanadu Oman celebrated grand style
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News