మోదీ నాకు తండ్రి లాంటివారు: పవన్

admin
Published by Admin — June 07, 2026 in Andhra
News Image

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీపై ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మో డీతో త‌న‌కు ఉన్న అనుబంధం ఇప్ప‌టిది కాద‌ని చెప్పారు. 30 ఏళ్ల కింద‌ట నుంచి మోడీతో త‌న‌కు అను బంధం ఉంద‌ని.. ఆయ‌న దేశానికి ప్ర‌ధాని అయినా.. త‌న‌కు మాత్రం తండ్రి లాంటి వార‌ని తెలిపారు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌కుముందు నుంచే మోడీతో త‌న‌కు ప్ర‌త్యేక స్నేహం ఉంద‌న్నారు. అనేక సంద‌ర్భాల్లో ఆయ‌న‌సూచ‌న‌లు స‌ల‌హాలు తీసుకున్న‌ట్టు తెలిపారు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. త‌న కుటుంబం నుంచి త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి కూడా ప్ర‌ధాని మోడీకి అన్నీ తెలుసున‌న్నారు. తన‌కు అనేక సం దర్భాల్లో ఫోన్ చేసి వివ‌రాలు ఆరా తీసేవార‌ని తెలిపారు. అయితే.. ఎక్క‌డా ప్ర‌ధాని నోటి వెంట జాతీయ ప్ర‌యోజ‌నాలు, దేశ భ‌ద్ర‌త‌, ప్ర‌జ‌ల సంక్షేమం, భ‌విష్య‌త్తు భార‌తం ..వంటి అనేక దీర్ఘ‌దృష్టిగ‌ల అంశాలే చ‌ర్చ‌కు వ‌చ్చేవ‌ని చెప్పారు.

గ‌త ఏడాది త‌న చిన్న కుమారుడు మార్క్ శంక‌ర్ విదేశాల్లోని విద్యాల‌యంలో ప్ర‌మాదానికి గురైన‌ప్పుడు కూడా ప్ర‌ధాని నుంచే త‌న‌కు ఫ‌స్ట్ కాల్ వ‌చ్చింద‌ని.. ఆయ‌న ఎంతో ధైర్యం చెప్పార‌ని ప‌వ‌న్ తెలిపారు. ఆ త‌ర్వాత గ‌త నెల‌లో ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు కూడా త‌న ఆరోగ్యం విష‌యంలో ఒక తండ్రికంటే ఎక్కువ‌గా శ్ర‌ద్ధ చూపార‌ని.. ఆయ‌న సూచ‌న‌లు ఇచ్చినా తాను మాత్రం వాటిని ఆదేశాలుగానే ప‌రిగ‌ణిస్తాన‌ని చెప్పా రు. జాతీయతా భావాన్ని పుణికి పుచ్చుకున్న మోడీని ఒక ప్ర‌ధానిగా కంటే కూడా.. ఈ దేశం గ‌ర్వించ‌ద‌గ్గ నాయ‌కుడిగా చూడ‌డ‌మే త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పారు.

భ‌విష్య‌త్తు మోడీతోనే..

ఈ దేశానికి భ‌విష్య‌త్తు మోడీతోనే ఉంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు. విక‌సిత్ భార‌త్ 2047 మ‌న‌కు ఎంతో స్ఫూర్తినిస్తుంద‌ని తెలిపారు. ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న జాతీయతా భావాన్ని పెంపొందిస్తున్నార ని.. జ‌న‌సేన‌కు ఇది ఎంతో స్ఫూర్తిదాయ‌కంగా నిలిచింద‌న్నారు. ప్రాంతీయ పార్టీల్లో జాతీయ‌తా భావం కొర‌వ‌డింద‌న్న వాద‌న ఎప్పుడు వ‌చ్చినా.. త‌నకు కొంత ఇబ్బందిగానే ఉంటుంద‌న్నారు. అందుకే.. తాము జాతీయ భావాన్ని పెంచేందుకు కూడా కృషి చేస్తున్న‌ట్టు వివ‌రించారు. 

Tags
Pm modi father figure ap deputy cm pawan kalyan
Recent Comments
Leave a Comment

Related News