జ‌గ‌న్ పేరు ఎత్తకుండానే ఇచ్చి ప‌డేసిన లోకేష్‌!

admin
Published by Admin — June 08, 2026 in Andhra
News Image

వైసీపీ నాయ‌కులు, ముఖ్యంగా పార్టీ అధినేత జ‌గ‌న్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై మంత్రి నారా లోకేష్‌.. త‌ర‌చుగా కౌంట‌ర్లు ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ కౌంట‌ర్లు కూడా సుతిమెత్త‌గా కాకుండా.. ఘాటుగానే ఉంటున్నా యి. ఒక్కొక్క‌సారి వైసీపీ తిరిగి కౌంట‌ర్ ఇవ్వ‌లేనంత‌గా లోకేష్ ఇస్తున్న కౌంట‌ర్లు ప‌నిచేస్తున్నాయి. తాజాగా లోకేష్ రష్యాలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే.. దీనిని కార్న‌ర్ చేస్తూ.. వైసీపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

ఏపీ నుంచి సొమ్ములు తీసుకువెష‌ళ్లి.. ర‌ష్యాలో దాచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానించారు. సింగ‌పూర్ లో దాచి దాచి.. అక్క‌డ బ్యాంకులు ఖాళీలేవ‌ని చెప్ప‌డంతోనే ఇప్పుడు ర‌ష్యాలో దాచుకునేందుకు వెళ్లార‌ని ఎద్దేవా చేశారు. మ‌రికొంద‌రు నాయ‌కులు.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక‌వైపు ఖ‌జానా ఖాళీ అంటూ.. యాగీ చేస్తోంద‌ని.. విద్యార్థుల‌కు ఇవ్వాల్సిన ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు నిధులు ఆరోగ్య శ్రీ బ‌కాయిలు కూడా చెల్లించ‌డం లేద‌న్నారు.

ఇంతగా ప‌రిస్థితి దిగ‌జారినా.. లోకేష్ స‌హా మంత్రులు త‌మ ఆడంబ‌రాలు మాన‌డం లేద‌ని వైసీపీ నాయ కులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ర‌ష్యాకు ఎందుకు వెళ్లారో చెప్పాల‌ని వైసీపీ నేత వెంక‌ట‌రెడ్డి ప్ర‌శ్నించా రు. ప్ర‌జ‌ల సొమ్మును ప‌ప్పుబెల్లాల్లా క‌రిగించేస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. ఒక‌వైపు అప్పులు చేస్తున్నార‌ని కూడా చెప్పుకొచ్చారు. అయినా.. ర‌ష్యాలో ఇప్పుడు అంత బిజీ ప‌ని ఏముంద‌ని ప్ర‌శ్నించారు.

దీంతో వైసీపీ పేరు ఎత్త‌కుండానే లోకేష్ ఇచ్చి ప‌డేశారు. తాను ర‌ష్యాకు ఎందుకు వ‌చ్చిందీ చెప్పారు. ప్ర‌స్తుతం ర‌ష్యాలో పెట్టుబ‌డి దారుల స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ని.. ఏపీకి సంబంధించిన పెట్టుబ డుల పై చ‌ర్చించేందుకే తాను ర‌ష్యావ‌చ్చాన‌న్నారు. అంతేకాదు.. ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌కు త‌న సొమ్ములే ఖ‌ర్చు చేసుకుంటున్నాన‌ని.. ప్ర‌భుత్వ ఖ‌జానా నుంచి రూపాయి కూడా తీసుకోవ‌డం లేద‌న్నారు. తాను ఎక్క‌డికి వెళ్లినా.., రాష్ట్రం కోస‌మే ఆలోచ‌న చేస్తాన‌న్నారు. త‌న‌పై సీబీఐ కేసులు, ఈడీకేసులు లేవ‌ని.. `ఉన్న‌వాళ్ల ` మాదిరిగా రాజీ చేసుకునేందుకు తాను విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేయ‌న‌ని చుర‌క‌లంటించారు. 

Tags
Minister lokesh slams jagan
Recent Comments
Leave a Comment

Related News