పవన్ కు రేవంత్ రెడ్డి కౌంటర్!

admin
Published by Admin — June 13, 2026 in Telangana
News Image

తెలంగాణలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన వ్యవహారం రాజకీయ ధర్మవరం రేపిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ మీ అయ్యా జాగీరా అంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణకు వచ్చేందుకు, వెళ్లేందుకు, పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ కు (Pawan Kalyan) పూర్తి స్వేచ్ఛ ఉందని, అయితే శాంతిభద్రతల కారణంతోనే ఆయన సభకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. 

 
“ఏపీలో చాలాసార్లు జగన్ సభలకు అనుమతి ఇవ్వలేదు. ఎందుకు అనుమతి ఇవ్వలేదో పవన్ చెప్పాలి” అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రశ్నించారు.  పవన్ కళ్యాణ్ ప్రజల సెంటిమెంట్లను గాయపరిచే వ్యాఖ్యలు చేశారని, అందుకే మంత్రులు స్పందించారని చెప్పారు. అయినప్పటికీ తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం చేశారు. మరి, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పవన్ స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది వేచి చూడాలి.
Tags
cm revanth reddy ap deputy cm pawan kalyan counter comments on telangana
Recent Comments
Leave a Comment

Related News