ఆయన వరుస విజయాలు దక్కించుకున్న ఎమ్మెల్యే(MLA). అది కూడా.. గండరగండల వంటి నాయకులపైనే ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. రాజకీయంగా అత్యంత సున్నితమైన నియోజకవర్గంలో.. అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని ముందుకు సాగారు. ఆయనే.. అద్దంకి ఎమ్మెల్యే ప్రస్తుతం విద్యుత్ శాఖమంత్రిగా ఉన్న గొట్టిపాటి రవి. ఎమ్మెల్యేగా వరుస విజయాలు ఒక ఎత్తయితే.. మంత్రిగా రెండేళ్లలో ఆయన వేసిన అడుగులు మరో ఎత్తని అంటున్నారు అనుచరులు.
ఎమ్మెల్యేగా..
గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar).. అద్దంకి నుంచి వరుస విజయాలు దక్కించుకున్నారు. ప్రత్యర్థులు మారినా.. ఆయ న గెలుపు మాత్రం మారలేదు. దీనికికారణం.. ప్రజల్లో ఆయన సంపాదించుకున్న మద్దతే కాదు.. ఆయన ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలని అనుకునే తత్వం. అదే.. ఆయననుప్రజలకు చేరువ చేసింది. హంగు ఆర్భాలకు దూరంగా ఉండడమేకాదు.. చిన్న సమస్య అయినా.. పెద్ద ఇంపార్టెన్స్ గా భావిస్తారు. ఎక్కడ ఉన్నా.. నియోజకవర్గం నుంచిఎవరైనా వచ్చారంటే.. ఆత్మీయంగా పలకరిస్తారు. సమస్యలేంటని తెలుసు కుంటారు. ఇదే.. ఆయనను సాధారణ ప్రజలకు చేరువ చేసింది.
మంత్రిగా..
ఇక, చంద్రబాబు(Chandrababu) హయాంలో తొలిసారి మంత్రి పదవిని చేపట్టిన గొట్టిపాటికి అత్యంత కీలకమైన విద్యుత్ శాఖను అప్పగించారు. ఈ శాఖ నిర్వహణ అత్యంత సున్నితమే కాదు.. రాజకీయంగా కూడా కీలకం. విద్యుత్ చార్జీలను పెంచిన వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. చార్జీలు ఒక్కటేకాదు.. ప్రభుత్వ పనితీరుకు-విద్యుత్ సరఫరాకు అవినాభావ సంబంధం కూడా ఉంటుంది. గంటల తరబడి విద్యుత్ కోతలు పెడితే.. సర్కారుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతుంది.
ఇవన్నీ..మంత్రిగా రవి(Ravi)కి కత్తిమీద సామే అయినా..వాటిని ఆయన చాకచక్యంగా పరిష్కరిస్తున్నారు. విద్యుత్ లోటును తీర్చేందుకు.. కేంద్రం ఇస్తున్న సూర్యఘర్ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా అమలు చేస్తున్నారు.విద్యుత్ చార్జీలు పెంచకుండా.. చూసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అంటే.. విద్యుత్ శాఖ కొనుగోలు చేసే పరికరాలు, స్తంభాలు.. ఇతరత్రా కీలక అంశాల్లో ఖర్చులు తగ్గించి.. ప్రజలపై భారాలు మోపకుండా చేస్తున్నారు. అలానే.. గ్రామీణ ప్రాంతాల్లోనూ కోతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో నిరంతరాయంగా సరఫరా ఉండేలా చేస్తున్నారు. ఇలా.. ఎమ్మెల్యేగా నియోజకవర్గం ప్రజలతో మంచి మార్కులు వేయించుకున్న రవి.. మంత్రిగా కూడా.. తనదైన ముద్ర వేస్తుండడం గమనార్హం.