సీఎం విజయ్ విడాకుల కేసు.. కోర్టు కీల‌క ఉత్త‌ర్వులు..!

admin
Published by Admin — June 15, 2026 in Movies
News Image

తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా చిత్ర పరిశ్రమలోనూ అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగిన ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై చెంగల్పట్టు మహిళా కోర్టులో ఈరోజు ఒక కీలకమైన విచారణ జరిగింది. ఇరుపక్షాల లాయర్లు తమ వాదనలను గట్టిగా వినిపించిన నేపథ్యంలో, ఈ కేసులో న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

వాస్తవానికి ఈ కేసుకు సంబంధించిన విచారణ గతంలోనే జరగాల్సి ఉన్నప్పటికీ, ఇరు వర్గాల నుంచి సరైన హాజరు లేకపోవడంతో కోర్టు(Court) తీవ్రంగా స్పందించింది. జూన్ 15 నాటి విచారణకు ఖచ్చితంగా హాజరుకావాలంటూ గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన న్యాయస్థాన ప్రక్రియలో, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. కేసు తీవ్రతను బట్టి తదుపరి నిర్ణయాన్ని ఆగస్టు నెలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

సుమారు 26 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్న సంగీత(Sangeetha), కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. 2021 నుంచే తమ మధ్య విభేదాలు మొదలయ్యాయని, విజయ్‌కు మరో నటితో ఉన్న సంబంధమే ఇందుకు ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా విజయ్ త‌న‌ను మాన‌సికంగా వేధించార‌ని, తనపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధించారని, గతంలో ఉన్న స్వేచ్ఛను, సౌకర్యాలను పూర్తిగా నియంత్రించారని సంగీత తన పిటిషన్‌లో ఆరోపించారు. అందుకే ప్రత్యేక వివాహాల చట్టం కింద తనకు విడాకులు మంజూరు చేయాలని ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సంద‌ర్భంగా విజయ్ కి ఉన్న సామాజిక, ఆర్థిక హోదాకు తగినట్లుగా భారీ మొత్తంలో భరణం చెల్లించాలని కూడా సంగీత డిమాండ్ చేశారు.

అయితే ఒకవైపు కోర్టులో లీగల్ ఫైట్ నడుస్తుండగానే, మరోవైపు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. విజయ్-సంగీత దంపతులను తిరిగి కలిపేందుకు, వారి మధ్య ఉన్న విభేదాలను తొలగించేందుకు ఇరుపక్షాల సన్నిహితులు, పెద్దలు తెరవెనుక తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రాజీ ప్రయత్నాల వార్తలపై విజయ్(Vijay) టీమ్ నుండి కానీ, సంగీత వైపు నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ... కోర్టు బయటే ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడి, ఇద్దరూ కలిసిపోయే అవకాశం ఉందంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags
Thalapathy Vijay CM Vijay Sangeetha Vijay Vijay Divorce Case Kollywood Chengalpattu Court
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News