సీఐ నాగరాజు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

admin
Published by Admin — June 25, 2026 in Andhra
News Image

విజ‌య‌వాడ కృష్ణ‌లంకకు చెందిన సాయికృష్ణ అనే యువ‌కుడి అదృశ్యం కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొం టున్న సీఐ(స‌స్పెండ్‌) నాగ‌రాజుకు.. విజ‌య‌వాడ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు ఆయ‌న‌ను రిమాండ్‌కు పంపిస్తూ.. కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. మంగ‌ళ‌వారం సాయంత్ర‌మే త‌మ అదుపులోకి తీసుకున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు బుధ‌వారం ఉదయం.. నాగ‌రాజును కోర్టులో హాజ‌రు ప‌రిచారు. అనంత‌రం.. ఆయ‌న‌కు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ సంద‌ర్భంగా సిట్ అధికారులు ప్రాథ‌మిక రిమాండ్ రిపోర్టును కోర్టుకు స‌మ‌ర్పించారు. దీనిలో సంచ‌ల న విష‌యాలు వెలుగు చూశాయి. సాయికృష్ణ‌ది అత్యంత సీరియ‌స్ కేసుగా అధికారులు పేర్కొన్నారు. ఇది ఉద్దేశ పూర్వ‌క కేసు అని తెలిపారు. అంతేకాదు.. సాయికృష్ణది లాకప్ డెత్ అని.. రిమాండ్ రిపోర్టులో స్ప ష్టం చేశారు. అంతేకాదు.. పోలీసులు ఆయ‌న‌ను తీసుకువ‌చ్చిన తీరు.. అనంత‌రం.. కస్టడీలో నిర్బంధించి కొట్టిన తీరును కూడా రిపోర్టులో వెల్ల‌డించారు.

సునిశిత శ‌రీర అవ‌య‌వాల‌కు తగిలిన గాయాల వల్లే సాయికృష్ణ‌ మరణించాడని రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు. ఇది సాధారణ మిస్సింగ్ కేసు కాదని, తీవ్రమైన అంశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకా దు మృతదేహాన్ని పోలీస్ స్టేషన్లో తాను చూశాన‌ని.. అదే స్టేష‌న్‌లో ప‌నిచేస్తున్న ఎస్ ఐ ఇచ్చిన వాంగ్మూ లాన్ని కూడా రిపోర్టులో పేర్కొన్నారు. అదేవిధంగా మే 1 నుంచి జూన్ 1 వరకు ఉద్దే శ పూర్వ‌కంగానే స్టేష‌న్ సీసీ టీవీ ఫుటేజీ మాయం చేశారని తెలిపారు. ఈ వ్య‌వ‌హారంలో పూర్తిస్థాయి ద‌ర్యాప్తు అవ‌స‌ర‌మ‌ని పేర్కొంది.

శవాన్ని దాచేందుకు ప్ర‌య‌త్నించార‌ని కూడా రిపోర్టులో పేర్కొన్నారు. మార్కాపురం నుంచి స్టేష‌న్‌కు తీసుకువ‌చ్చిన మాట వాస్త‌వ‌మేన‌ని, వ‌చ్చిన త‌ర్వాత సాయికృష్ణ నుంచి సెల్‌ఫోన్‌తీసుకున్నార‌ని.. అత‌ని త‌ల్లిని కూడా చూసేందుకు అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని తెలిపారు. అంతేకాదు.. సీఐ నాగ‌రాజు ద‌ర్యాప్తునకు స‌హ‌క‌రించ‌డం లేద‌ని, ద‌ర్యాప్తును సైతం ప‌క్క‌దారి ప‌ట్టిస్తున్నార‌ని రిపోర్టులో స్ప‌ష్టం చేశారు. 

Tags
Ci nagaraju Remand shocking revelation
Recent Comments
Leave a Comment

Related News