న్యూ ఏజ్ మెగాస్టార్‌... `పెద్ది`కి ప్ర‌ధాని కితాబు!

admin
Published by Admin — June 25, 2026 in Movies
News Image

మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు, స్టార్ హీరో.. రాం చ‌ర‌ణ్‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి భారీ ప్ర‌శంస‌లు ల‌భించాయి. `న్యూ ఏజ్ మెగా స్టార్‌`(కొత్త త‌రం మెగాస్టార్‌) అంటూ.. పెద్దిని ప్ర‌శంసించారు. ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన రిప‌బ్లిక్ స‌మ్మిట్‌కు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా.. రాంచ‌ర‌ణ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద ర్భంగా ప్ర‌ధాని మోడీ.. రాం చ‌ర‌ణ్‌ను అభినందించారు. ఆయ‌న మ‌రింతగా పురోభివృద్ధి సాధించాల‌ని కోరుకున్నారు. సుమారు 5 నిమిషాల‌కుపైగానే రాం చ‌ర‌ణ్‌తో ప్ర‌ధాని సంభాషించారు.

చిరు ఆనందం..

ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని మెగాస్టార్ చిరంజీవి.. మురిసిపోయారు. పుత్రోత్సాహంతో త‌న హృద యం నిండిపోయింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈవెంట్‌లో ప్ర‌ధానితో రాం చ‌ర‌ణ్ క‌లిసి ఉన్న ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. ``ఒక తండ్రిగా ఇంత‌కన్నా నాకు ఆనంద క్ష‌ణాలు ఏముం టాయి`` అని పేర్కొన్నారు. రాంచ‌ర‌ణ్‌.. మ‌రింతగా తెలుగు సినిమా రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్న‌ట్టు తెలిపారు.

త‌న కృషి, ప‌ట్టుద‌ల‌, న‌ట‌న‌తో అశేష ప్రేక్ష‌క ఆద‌ర‌ణ‌ను సొంతం చేసుకున్న రాం చ‌ర‌ణ్‌.. ఇప్పుడు జాతీ య వేదిక‌ల‌పై కూడా గుర్తింపు పొందుతుండ‌డం సంతోషంగా ఉంద‌ని చిరంజీవి పేర్కొన్నారు. ఒక తండ్రి గా ఈ సంద‌ర్భాలు త‌న‌కు ఎంతో గ‌ర్వంగా ఉన్నాయ‌ని తెలిపారు. పుత్రుడు పుట్ట‌గానే సంతోషించ‌డం ఒక ఎత్త‌యితే.. ఆ పుత్రుడు సాధించిన ఘ‌న‌త‌తో వ‌చ్చే ఆనందం మ‌రో ఎత్తు అంటూ వివ‌రించే సుమ‌తీ శ‌త‌కంలోని ప‌ద్యాన్ని ఈ సంద‌ర్భంగా చిరు వివ‌రించారు.

ముఖ్యంగా రాం చ‌ర‌ణ్‌ను ప్ర‌ధాని అంత‌టి నాయ‌కుడు.. `న్యూ ఏజ్ మెగాస్టార్‌` అని సంబోధించ‌డం మ‌రింత ఆనందం క‌లిగించింద‌ని చిరంజీవి తెలిపారు. కాగా.. ఈ స‌మ్మిట్‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌ముఖ న‌టులు, క్రీడాకారుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానించింది. వారితో ప్ర‌ధాన మంత్రి సంభాషించారు. రాబోయే యువ‌త‌రం కీల‌కంగా మార‌నున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని కూడా వారికి చేరువ అయ్యే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. 

Tags
Peddi movie pm modi hero ram charan new age megastar
Recent Comments
Leave a Comment

Related News