అమ‌రావ‌తిలో144 సెక్ష‌న్‌... హై టెన్ష‌న్‌!

admin
Published by Admin — June 27, 2026 in Andhra
News Image

ఏపీ విప‌క్షం(ప్ర‌ధాన కాదు) వైసీపీ నాయ‌కులు.. తాజాగా శ‌నివారం ఉదయం రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంతానికి వ‌చ్చారు. సుమారు 150 మంది నాయ‌కులు ఒక క‌మిటీగా ఏర్ప‌డ్డారు. వీరిలో కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాప‌ట్ల జిల్లాల‌కు చెందిన సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరంతా.. రాజ‌ధాని ప్రాంతంలో రైతుల‌ను ప‌రామ‌ర్శించేందుకు, వారి భ‌రోసా క‌ల్పించేందుకు వ‌చ్చామ‌ని చెబుతున్నారు.

అయితే.. వైసీపీ నాయ‌కుల క‌మిటీలు ఎంట్రీ ఇవ్వ‌డాన్ని అమ‌రావ‌తి రైతులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు . వైసీపీ నేత‌లు వ‌స్తున్నార‌ని తెలుసుకున్న రాజ‌ధాని ప్రాంతంలోని పెనుమాక‌, కృష్ణాయ‌పాలెం, ఉండ‌వ ల్లికి చెందిన రైతులు, వారి కుటుంబాలు నిర‌స‌న‌కు దిగాయి. వైసీపీ నాయ‌కులు గ‌త ఐదేళ్లు అమ‌రావ‌తికి ఏం చేశార‌ని? ప్ర‌శ్నించారు. అంతేకాదు.. అమ‌రావ‌తిని రాక్ష‌సుల రాజ‌ధాని అని, శ్మ‌శానం అని వ్యాఖ్యా నించిన విష‌యాన్ని గుర్తు చేశారు.

ఇప్పుడు పార్టీ ఓట‌మి త‌ర్వాత కూడా.. మావిగ‌న్‌(మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరుల‌తో కూడిన రాజ ధాని) అని చెబుతున్నార‌ని.. దీనిని వ‌దిలి పెట్టామ‌ని చెబితేనే.. అమ‌రావ‌తిని మాత్ర‌మే ఏకైక రాజ‌ధానిగా గుర్తిస్తున్నామ‌ని చెబితేనే రాజ‌ధాని ప్రాంతంలోకి అడుగు పెట్టేందుకు అనుమ‌తిస్తామ‌ని రైతులు తేల్చి చెప్పారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విష‌యం తెలిసి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. ఇరు వ‌ర్గాల‌ను శాంతింప‌జేసేందుకు ప్ర‌య‌త్నించారు.

అయిన‌ప్ప‌టికీ ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగ‌డంతో 144 సెక్ష‌న్ విధించారు. దీంతో వైసీపీ నాయకులు పోలీ సు ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అయిన‌ప్ప‌టికీ.. వారు అనుమ‌తించ‌లేద‌ని తెలిసింది. ఇది లావుంటే.. ఇటీవ‌ల కొంద‌రు రైతులు.. భూ స‌మీక‌ర‌ణ‌కువ్య‌తిరేకంగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను క‌లుసు కున్నారు. అనంత‌రం.. వారికి అండ‌గా నిల‌వాల‌ని పార్టీ అధినేత సూచించ‌డంతో వైసీపీ నాయ‌కులు క‌మిటీలుగా ఏర్ప‌డి ఇక్క‌డ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. అయితే.. రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులు మాత్రం వీరి రాక‌ను వ్య‌తిరేకిస్తున్నారు. అమ‌రావ‌తిని ఏకైక రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన త‌ర్వాతే అడుగు పెట్టాల‌ని సూచిస్తున్నారు. 

Tags
Amaravati ycp TDP tension
Recent Comments
Leave a Comment

Related News