బే ఏరియాలోని శాన్ జోస్ టాలీవుడ్ రాక్ స్టార్, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవీ శ్రీ ప్రసాద్ (DSP) లైవ్ కాన్సర్ట్ తో అదరగొట్టాడు. బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA), బే ఏరియా ఎంటర్‌టైన్‌మెంట్స్ (BAE), రియల్టర్ నాగరాజ్ అన్నయ్య & APEX కన్సల్టింగ్ సర్వీసెస్‌తో కలిసి నిర్వహించిన ఈ లైవ్ కాన్సర్ట్ గ్రాండ్ సక్సెస్ అయింది. సంగీతం, ఉత్సాహం, సామాజిక స్ఫూర్తి ప్రతిబింబించిన ఈ ఈవెంట్ లో వేలాదిమంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
తన ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను డీఎస్పీ ఉర్రూతలూగించారు. చార్ట్‌బస్టర్ హిట్స్, నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన ఈ కాన్సర్ట్ దాదాపు 3 గంటల పాటు సాగింది. తన ఎనర్జిటిక్ పర్మార్ఫెన్స్ తో దేవీ శ్రీ ప్రసాద్ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ అలరించారు. డీఎస్పీతోపాటు కార్తీక్, సమీరా భరద్వాజ్, రీతా, సాగర్ వంటి గాయకులు, డ్యాన్సర్లు అలరించారు. వర్షం సినిమాలో మెల్లగా కరగనీ వంటి స్లో పాయిజన్ వంటి పాటలతో పాటు...కిస్ కిస్ కిసిక్కు అంటూ పుష్ప చిత్రంలోని ఫాస్ట్ బీట్ పాటలకు ప్రేక్షకులు చిందేశారు.
తాను హీరోగా ఎల్లమ్మ చిత్రంతో తెరంగేంట్రం చేయబోతున్నానని ఈ వేదికపై దేవీ ప్రకటించడం విశేషం. దిల్ రాజు నిర్మాణంలో, వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ చిత్రంతో నటుడిగా ప్రేక్షకులను పలకరించబోతున్నానని చెప్పారు. 27 ఏళ్ల క్రితం సంగీత దర్శకుడిగా దేవీ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టానని, ఇప్పుడు నటుడిగా మొదటి సినిమా కూడా అమ్మవారి కథతో మొదలుబెట్టడం సంతోషంగా ఉందన్నారు. సంగీత దర్శకుడిగా విజయవంతం అయినట్లు నటుడిగా మొదలుబెట్టిన ఈ ఈ కొత్త అధ్యాయం కూడా అంతే విజయవంతంగా ఉంటుందని ఆశిస్తున్నానని చెప్పారు. 2008 నుంచి తన అమెరికా కాన్సర్ట్ టూర్లలో శాన్ జోస్ ఎప్పుడూ ప్రత్యేకమైనదేనని దేవీ అన్నారు. BATA మరియు బే ఏరియా తెలుగు సమాజం మద్దతు అందుకు కారణమని చెప్పారు.
ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ కావడానికి కృషి చేసిన BATA టీమ్, వాలంటీర్లు, స్పాన్సర్లు, సపోర్టర్లకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. నెలల తరబడి ప్లానింగ్ చేసి ఎటువంటి లోటు లేకుండా ఈ ఈవెంట్ ను విజయవంతం చేసిన బాటా ఆర్గనైజింగ్ టీమ్‌కు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మీడియా భాగస్వాములైన విరిజల్లు రేడియో, బాలీ 92.3, నమస్తే ఆంధ్ర, యో ఇండియా TV, TV9, తెలుగు టైమ్స్ & ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. రుద్ర డాన్స్ అకాడమీ (NJ) & మచ్చా స్వాగ్ టీమ్ నృత్యకారులు
ప్లాటినం స్పాన్సర్లు: సౌజన్య అనుబోతు (SS Realty), Xpat.Money
ఇతర స్పాన్సర్లు: అమోఘం ఇండియన్ క్యూజీన్ (గోల్డ్), కావ్య ఫుడ్స్, ఇన్‌స్టా సర్వీస్, మలబార్ గోల్డ్/డైమండ్స్ (సిల్వర్)
ఈ కాన్సర్ట్ కేవలం సంగీత కార్యక్రమం కాదని, ఇది సంస్కృతి, సమాజం మరియు సార్వత్రిక భాష అయిన సంగీతానికి సంబంధించిన ఉత్సవం అని BATA నిర్వాహకులు అన్నారు. వేలాది మంది ప్రేక్షకులు ఒకచోట చేరి ఆడిపాడడం నిజంగా మరపురాని అనుభూతి అని హర్షం వ్యక్తం చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ చివరి పాటకు ప్రేక్షకులంతా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారని సంతోషించారు.
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) సాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో తెలుగు సంస్కృతి, భాష, కళలు, విద్య, సామాజిక కార్యకలాపాలను ప్రోత్సహించే అగ్రగామి నాట్-ఫార్-ప్రాఫిట్ సంస్థ. సాంస్కృతిక ఉత్సవాలు, విద్యా కార్యక్రమాలు, సేవా కార్యాలు, ప్రపంచ స్థాయి వినోద కార్యక్రమాల ద్వారా BATA తెలుగు ప్రజల సంపన్న వారసత్వాన్ని జరుపుతూ, సమాజ సంబంధాలను బలోపేతం చేస్తోంది.