వైజాగ్ పేరెత్తగానే జారుకున్న జగన్

admin
Published by Admin — July 02, 2026 in Andhra
News Image

అమరావతి రాజధానిపై జగన్ కక్షగట్టిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల పాలనలో అమరావతిపై అన్ని రకాలుగా విషం కక్కిన జగన్....మూడు ముక్కలాట పేరుతో విశాఖ ఆర్థిక రాజధాని అంటూ ముమ్మరంగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత విశాఖ రాజధానిని పక్కన పెట్టేసి మావిగన్ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు జగన్. ఇక తాజాగా రాబోయే ఎన్నికల్లో మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ ఎన్నికల ప్రచారం చేస్తానని ఈరోజు జగన్ చేసిన ప్రకటన నేపథ్యంలో సొంత పార్టీ వారి నుంచే జగన్ కు విమర్శలు ఎదురవుతున్నాయని టాక్ వస్తోంది.

ఇక, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు అయితే జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని ఉండాలన్న ఉద్దేశం జగన్ కు లేదని, గతంలో విశాఖ ఇప్పుడు మావిగన్ అంటూ టైం పాస్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో విశాఖ రాజధాని సంగతి ఏంటి అంటూ జగన్ ను ఓ విలేకరి ప్రశ్నించగా మెల్లగా అక్కడి నుంచి ఆయన జారుకున్నారు. రేపు మావిగన్ పరిస్థితి కూడా ఇంతే అని సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ జరుగుతోంది.

రాష్ట్ర రాజధానిపై జగన్ కు ఒక మాట మీద నిలబడే అలవాటు లేదని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అమరావతి రాజధానిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఇటువంటి తప్పుడు ప్రకటనలతో జగన్ పబ్బం గడుపుకుంటున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Tags
jagan mavigun vizag
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News